నేను రియల్ హీరోని కాదు..రియల్ హీరోలు ప్రజలే..: సోనూసూద్

ABN , First Publish Date - 2021-09-09T14:05:00+05:30 IST

బాలీవుడ్ హీరో సోనూసూద్ గురువారం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‎పోర్ట్‎కు చేరుకున్నారు. సోనూసూద్‎కి ఎయిర్‎పోర్టులో బీజేపీ నేతలు ఘనస్వాగతం

నేను రియల్ హీరోని కాదు..రియల్ హీరోలు ప్రజలే..: సోనూసూద్

కృష్ణా:బాలీవుడ్ హీరో సోనూసూద్ గురువారం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‎పోర్ట్‎కు చేరుకున్నారు. సోనూసూద్‎కి ఎయిర్‎పోర్టులో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సోనూసుద్ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడకు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నేను రియల్ హీరో కాదని, రియల్ హీరోలు ప్రజలే అని అన్నారు. నా ప్రజా సేవను కొనసాగిస్తూనే ఉంటాను..ప్రజల అభిమానం ఎప్పటికీ మరువనని సోనూసూద్ అన్నారు.

Updated Date - 2021-09-09T14:05:00+05:30 IST