ltrScrptTheme3

సినిమా దర్శకుడినే తిట్టిన బాలీవుడ్ హీరోయిన్

Oct 27 2021 @ 18:54PM

జన్నత్-2 సినిమాలో ఇమ్రాన్ హష్మీ సరసన నటించి బాలీవుడ్‌లో కెరీర్‌ను ఆరంభించిన నటి ఇషాగుప్తా. తన టాప్ లెస్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విపరీతంగా అభిమానులను పెంచుకుంటోంది. అందాలను అరబోస్తూ సినిమాలో అవకాశాలను కొల్లగొడుతోంది. తనది ఇతరులకు లొంగిపోయే మనస్తత్వం కాదని ఆమె చెబుతోంది. ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండు చెంపలను పగలకొడతానంటోది. 


సినిమా షూటింగ్‌లో ఒక డైరెక్టర్ తిట్టడంతో అందుకు బదులుగా ఆయనను తిట్టానని ఆమె చెప్పింది. దీంతో ఆ సినిమా షూటింగ్ నుంచి తప్పుకున్నానని వెల్లడించింది. రెండు రోజుల అనంతరం అతడు వచ్చి క్షమాపణ కోరడంతో తిరిగి చిత్రీకరణకు హాజరయ్యానని ఆమె వివరించింది. 


ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..‘‘ నాకు, డైరెక్టర్‌కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌ రావడంతో వేరే దుస్తులు ధరించి షూటింగ్‌కి హాజరయ్యాను. నేను చిత్రీకరణకి ఆలస్యంగా వచ్చానని దర్శకుడు నన్ను తిట్టాడు. నేను ఆలస్యంగా రాలేదు. షూటింగ్‌కి మీ అందరి కంటె ముందుగానే వచ్చాను. ఈ దుస్తులు ధరించి రావడం నా తప్పు కాదు. మీరు ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో ఈ దుస్తులతో వచ్చాను. ఆ డైరెక్టర్ ఏమని నన్ను తిట్టాడో నేను అవే మాటలను ఆయనతో అన్నాను. నాతో ఎవరూ ఈ విధంగా ప్రవర్తించలేదని ఆయన చెప్పాడు. నన్ను అగౌరవపరచకన్నాడు. నేను వెంటనే ఆ షూటింగ్ నుంచి తప్పుకున్నాను. చిత్ర నిర్మాతలు ఫోన్ చేసి క్షమించమని కోరారు ’’ అని ఆమె తెలిపింది. 


కానీ, అందుకు ఇషా గుప్తా అంగీకరించలేదని చెప్పింది. దర్శకుడు వచ్చి క్షమాపణలు కోరితేనే చిత్రీకరణకు హాజరవుతానని ఆమె సమాధామిచ్చింది. డైరెక్టర్ వచ్చి రెండు రోజుల అనంతరం క్షమాపణ కోరడంతో తిరిగి షూటింగ్ కు హాజరయ్యానని ఆమె చెప్పింది.

Follow Us on:

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.