ఘనంగా బాలీవుడ్ హీరోయిన్ మెహందీ ఫంక్షన్.. పిక్స్ వైరల్..

Published: Wed, 26 Jan 2022 18:53:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఘనంగా బాలీవుడ్ హీరోయిన్ మెహందీ ఫంక్షన్.. పిక్స్ వైరల్..

బాలీవుడ్‌లో గతేడాది ఎక్కడ చూసినా పెళ్లి, పెళ్లి అనే పదాలే ఎక్కువగా వినిపించాయి. అనుష్క రంజన్-ఆదిత్య సీల్, పత్రలేఖ-రాజ్ కుమార్ రావ్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ తదితరులు 2021లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది కూడా బాలీవుడ్‌లో పెళ్లి భాజాలు చాలానే మోగనున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదిలో తొలుత నాగినీ బ్యూటీ మౌనీరాయ్‌ వైవాహిక జీవితాన్ని ప్రారంభించనుంది. బిజినెస్‌మెన్ సూరజ్ నంబియార్‌ను ఆమె జనవరి 27న గోవాలో వివాహమాడనుంది. ఈ పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా హల్దీ, మెహందీ ఫంక్షన్‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 


మౌనీరాయ్ స్నేహితులైన జియా ముస్తాఫా, అర్జున్ బిజిలానీ అతడి భార్య నేహా స్వామి బిజిలానీ ఆ ఫంక్షన్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫంక్షన్‌లో ఆమె పసుపు కలర్ లెహంగా ధరించి కనిపించింది. మరో ఫొటోలో సూరజ్ నంబియార్ కూడా కనిపించారు. ఆయన తెలుపురంగు దుస్తులు ధరించారు. హల్దీ, మెహందీ వేడుకలు బుధవారం జరిగినట్టు సమాచారం.





Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...