
‘ఆర్ఆర్ఆర్’లో హీరోయిన్గా నటిస్తోన్న ఆలియా భట్ విద్యార్హత ఏంటో తెలుసా? పన్నెండో తరగతి! అవును, ఆమె హై స్కూల్ తరువాత కాలేజ్‌కి వెళ్లనే లేదు. కొన్నాళ్లు ఫారిన్ కంట్రీలో గడిపి వచ్చిన ఆమె ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్‘ సినిమాతో హీరోయిన్ అయిపోయింది! రియల్ లైఫ్‌లో కాలేజ్కే వెళ్లని ఆలియా బాలీవుడ్‌లోకి మాత్రం కాలేజ్ స్టూడెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్‘లో ఆమె స్టూడెంట్‌గా కనిపించింది!

ఆమీర్ ఖాన్ కూడా పదకొండు, పన్నెండు తరగతులు మాత్రమే చదివాడు. ఆ తరువాత రంగస్థలంపై దృష్టి పెట్టాడు. కొన్నాళ్లు స్టేజ్ ఆర్టిస్ట్‌గా కొనసాగి తరువాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనుభవం సంపాదించాడు. ఫైనల్‌గా మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ హీరో అయిపోయాడు!

చిన్న నాటి నుంచే బ్యాడ్మింటన్ ఆడిన దీపికా బాలీవుడ్ స్టార్ అయ్యేందుకు చదువును మధ్యలోనే ఆపేసింది. మోడలింగ్ చేస్తున్న రోజుల్లో ఆమె ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్స్‌కు ఎన్రోల్ అయింది. కానీ, అది పూర్తి చేయకుండానే మోడల్‌గా, హీరోయిన్గా బిజీ అయింది. కాలేజ్‌కి ఏనాడూ వెళ్లకున్నా ఎందరో కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలకు ఇప్పుడామె ఫేవరెట్ ఐడల్!

ప్రియాంక చోప్రా క్రిమినల్ సైకాలజిస్ట్ అవ్వాలనుకుందట! కానీ, ఆర్మీ స్కూల్లో చదువు పూర్తి చేసి ముంబైలోని ఓ కాలేజ్‌లో చేరిన ఆమె మోడలింగ్ కోసం క్లాస్రూముకి గుడ్ బై చెప్పేసింది. ఆ తరువాత మన మిస్ వరల్డ్ ఎలా మిసెస్ జోనాస్గా అంచెలంచెలుగా ఎదిగిందో, మనందరికీ తెలిసిందే కదా!

అక్షయ్ కుమార్‌ది మరీ డిఫరెంట్ జర్నీ! ఆయన తనకు చదువు మీద పెద్ద శ్రద్ధ ఉండేది కాదని స్వయంగా ఒప్పుకుంటాడు. అందుకే, స్కూలు పూర్తయ్యాక కాలేజ్‌లో చేరి కూడా మధ్యలోనే ఆపేశాడు. విదేశాల్లో చెఫ్‌గా పని చేస్తూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఇండియాకి తిరిగొచ్చిన ‘ఖిలాడీ’ తరువాత ముంబైలో స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలందరిలో అత్యంత సంపన్నుడు ఈయనే అనటంలో అనుమానం అక్కర్లేదు. అంత వేగంగా విభిన్నమైన చిత్రాలు చేస్తుంటాడు అక్కీ!

డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయిన హీరోయిన్స్ లిస్టుకి అంతే ఉండదు. అలాంటి వారిలో కంగనా కూడా ఒకరు. ఆమె మెడిసిన్ చదవటానికి రెడీ అయ్యి ఓ ఎంట్రన్స్ పరీక్ష రాసింది. అందులో క్వాలిఫై కాలేదు. అంతే, మన ‘తలైవి‘ డిజీషన్ మారిపోయింది. ఇంటి నుంచీ దిల్లీకి బయలుదేరి మోడలింగ్‌లో బిజీ అయింది. ముంబైకి చేరుకుని బాలీవుడ్ ‘క్వీన్’గా ఎదిగింది!

అందరిదీ ఒక కథ. కత్రీనా కైఫ్ది మరోకథ! ఈమె కాలేజ్‌కి కాదు, అసలు స్కూలుకి కూడా సరిగ్గా వెళ్లలేదు! కత్రీనా తల్లి తన వృత్తి రిత్యా అనేక దేశాలు తిరగాల్సి వచ్చేదట. దాంతో క్యాట్ ఎడ్యుకేషన్ అంతా ఇంట్లోనే ట్యూటర్స్ వద్ద కొనసాగింది. ఇక కాలేజ్‌కి వెళ్లాల్సిన వయస్సుకల్లా ఆమె మోడలింగ్ బాట పట్టింది. తరువాత హీరోయిన్ అయిపోయింది. మరిక కాలేజీకి టైమేది? కత్రీనా ఏనాడూ కళశాల ముఖం చూడలేదు!

రాజ్ కపూర్ మనవడు, రిషీ కపూర్ తనయుడు... రణబీర్ కపూర్! ఈయనకు చదువు మీద కన్నా నటన మీద ఎక్కువ ఆసక్తి ఉండటం, ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమా? పదో తరగతి పాసైన రణబీర్ నేరుగా న్యూ యార్క్ వెళ్లి ఫిల్మ్ మేకింగ్‌లో డిప్లోమా చేసి వచ్చాడు! కాలేజ్ అనే పదమే ఆయన డిక్షనరీలో లేదు!

కపూర్ ఫ్యామిలీ నుంచీ వచ్చిన మరో నట వారసురాలు కరీనా. ఈమె కూడా ఉన్నత విద్య జోలికి వెళ్లలేదు. నిజానికి పన్నెండో తరగతి తరువాత బెబో ‘లా’ చదవాలనుకుందట. కానీ, అలా అలా మోడలింగ్, యాక్టింగ్‌లోకి వచ్చేసింది. ఇద్దరు పిల్లల తల్లిగా కూడా తన క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరకుండా చూసుకుంటోంది మిసెస్ సైఫ్!

ఐశ్వర్య రాయ్ కూడా డాక్టర్ అవ్వాలని భావించి యాక్టర్ అయిపోయిన వర్గంలోకే వస్తుంది! అయితే, ఆమె మొదట మెడిసిన్ అనుకుంది. తరువాత ఆర్కిటెక్ట్ అవ్వాలని డిసైడ్ అయింది. తీరా ఆర్కిటెక్చర్లో ఇంజనీర్ అవుదామని కాలేజ్ మొదలు పెట్టాక మిస్ వరల్డ్ కిరీటం తలపైన చేరింది. ఇంకెక్కడి చదువు? గ్లామర్ ప్రపంచం ఐష్ కోసం గేట్లు తెరిచేయటంతో... కళాశాల గేటు వైపు మళ్లీ చూడలేదు!

సల్మాన్ ఖాన్ కాలేజ్‌లో చేరి డ్రాప్ అవుట్‌గా ఇండస్ట్రీ బాట పట్టాడు. ఆయన తండ్రి సలీమ్ ఖాన్ బాలీవుడ్లో ప్రఖ్యాత రచయిత. మరిక ఆయనకి నటన మీద ఆసక్తి కలగటంలో ఆశ్చర్యమేం ఉంది! వ్యక్తిగత కారణాలతో మొదట కాలేజ్ మానేసిన సల్లూ భాయ్ ‘మైనే ప్యార్ కియా’ లాంటి బ్లాక్ బస్టర్‌తో హీరో అయ్యాడు. ఇక ఆపైన ఆయనకు చదువుతో మళ్లీ పనిబడలేదు!

ఈ తరం హీరోల్లో సూపర్ ఫిట్ హ్యాండ్సమ్ బాయ్... టైగర్ ష్రాఫ్. ఇతను కూడా కాలేజ్ వైపు వెళ్లేందుకు అస్సలు ఆసక్తి చూపలేదు. స్వయంగా తాను కూడా, హీరో అయిన తండ్రి జాకీ ష్రాఫ్, ఇంకేమంటాడు? ట్వల్త్ గ్రేడ్ కంప్లీట్ చేయగానే టైగర్ మోడలింగ్, సినిమా రంగాల వైపు వేటకు పంపాడు! ప్రస్తుతం ఈ యంగ్ హీరో బాలీవుడ్లో దూసుకుపోతున్నాడు!

బోణీ కపూర్ లాంటి బాలీవుడ్ బడా నిర్మాత కొడుకు అర్జున్ కపూర్ హీరో అవ్వక మరింకేం చేస్తాడు? అదే చేశాడు. అయితే, ఈయనకి చదువు మీద ఎంత ఆసక్తి అంటే... పన్నెండో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌కు కూడా ఫెయిలయ్యాడు! ఇక లాభం లేదనుకుని భారీగా ఉన్న తన విగ్రహాన్ని తగ్గించుకుని సిక్స్ ప్యాక్ సంపాదించాడు. ‘ఇషక్జాదే‘ సినిమాతో బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేశాడు!

బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్ తల్లి మాత్రమే కాదు ఆమె అమ్మమ్మ కూడా నటీమణే! తరతరాలుగా బాలీవుడ్, మరాఠీ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు కాజోల్ కుటుంబ సభ్యులు. అందుకే, ఆమె 17 ఏళ్ల వయస్సులోనే తొలి చిత్రంలో నటించేసింది. మరిక ‘బాజీగర్‘ బ్యూటీకి హై స్కూలుకి వెళ్లే టైం ఎక్కడిది? హై స్కూలుకే వెళ్లలేదంటే, కాలేజీకి సైతం వెళ్లలేదనే కదా అర్థం! కాజోల్ కేవలం పదో తరగతి మాత్రమే పూర్తి చేసింది...