వరవరరావు పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-10-27T02:09:42+05:30 IST

భీమా కోరేగావ్ కేసులో అరెస్టైన వరవరరావు పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం కొన్ని షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న ఆయన నవంబర్ 18 వరకు తలోజా జైలు ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది..

వరవరరావు పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ

ముంబై: భీమా కోరేగావ్ కేసులో అరెస్టైన వరవరరావు పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం కొన్ని షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న ఆయన నవంబర్ 18 వరకు తలోజా జైలు ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అయితే తన స్వస్థలం హైదరాబాద్‌కు తరలింపు అంశాన్ని కోర్టు వాయిదా వేసింది. తన ఆరోగ్య పరిస్తితి దృష్ట్యా హైదరాబాద్‌కు తరలించే అంశంపై ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని వరవరరావుకి బాంబే హైకోర్టు సూచించింది. ఇదిలా ఉండగా.. వరవరరావు ఆరోగ్యం బాగానే ఉందని, ఆయనను హైదరాబాద్‌కు తరలించాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టుకు ఎన్‌ఐఏ పేర్కొంది. ఫిబ్రవరి 22న కండిషనల్ బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు.. ఆ బెయిల్‌ను రెండు మార్లు పొడగించింది. తాజాగా నవంబర్ 18 వరకు బెయిల్ కొనసాగనున్నట్లు కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

Updated Date - 2021-10-27T02:09:42+05:30 IST