Advertisement

విడుదలకు సిద్ధమైన ‘బొంభాట్’

Dec 1 2020 @ 17:32PM

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సమర్పణలో సూచిత డ్రీం వర్క్స్ ప్రొడక్షన్ పతాకంపై సుశాంత్, చాందిని చౌదరి మరియు సిమ్రాన్ చౌదరి ముఖ్య తారాగణంగా.. రాఘవేంద్ర వర్మ దర్శకత్వంలో విశ్వాస్ హన్నూర్ కార్ నిర్మిస్తున్న రోబోటిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం 'బొంభాట్'. ఈ చిత్రం డిసెంబర్ 3న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాతలు చిత్ర విడుదల విషయాలను తెలియజేశారు.


ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్ర వర్మ మాట్లాడుతూ.. ''సరికొత్త కథతో డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో వస్తున్న చిత్రం 'బొంభాట్'. నా కథను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత విశ్వాస్ హన్నూర్ కార్ గారికి ధన్యవాదాలు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావుగారు మా సినిమా స్క్రిప్ట్ దశ నుంచి మాతో ఉండి మమ్మల్ని వెనకుండి నడిపించారు. అయన సినిమా చూసి చాలా బాగుంది అని సూపర్ హిట్ అవుతుంది అని కొనియాడారు. బొంభాట్ చిత్రం ఒక రోబోటిక్ కథ కథనంతో వస్తుంది. చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రాన్ని కేవలం 38 రోజుల్లో హైదరాబాద్ పరిసరప్రాంతాలో చిత్రీకరించాం. మా చిత్రంలో మకరంద్ దేశ్ పాండే క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుంది. మా చిత్రానికి  జోష్ బి సంగీతాన్ని అందించారు. ప్రియదర్శిని తన పంచ్ డైలాగులతో వినోదాన్ని రెట్టింపు చేస్తారు. మా సినిమా 2020 డిసెంబర్ 3 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతుంది. తప్పకుండా అందరూ చూడండి.." అని తెలిపారు. 


నిర్మాత విశ్వాస్ హన్నూర్ కార్ మాట్లాడుతూ.. ''నాకు కథ చాలా బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులకి ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. మా సినిమా చూసి మెచ్చుకున్న దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావుగారికి ధన్యవాదాలు. అయన సలహాలు సూచనలు మా సినిమాకి చాలా ఉపయోగపడ్డాయి. తెలుగు ప్రేక్షకులకి మంచి సినిమా అందించాలి అని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. మా బొంభాట్ సినిమా 2020 డిసెంబర్ 3న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది, తప్పక చూడండి" అని తెలిపారు. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.