Advertisement

`బొమ్మ అదిరింది` టీజర్ విడుదల!

Dec 2 2020 @ 17:14PM

షకలక శంకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం `బొమ్మ అదిరింది-దిమ్మ తిరిగింది`. నూత‌న ద‌ర్శ‌కుడు కుమార్ కోట ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మ‌హంకాళి మూవీస్, మ‌హంకాళి దివాక‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ణిదీప్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై లుకాల‌పు మ‌ధు, సోమేశ్ ముచ‌ర్ల, దత్తి సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.   


ఇప్పటికే విడుదలైన ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ బయటకు వచ్చింది. ప్ర‌‌ముఖ కథానాయిక ప్ర‌గ్యా జైస్వాల్ ఈ టీజ‌ర్‌ని‌ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ దశలో ఉందని నిర్మాతలు తెలిపారు. ష‌క‌ల‌క శంక‌ర్ మార్క్ కామెడీతో పాటు యూత్‌ని ఆక‌ట్టుకునే అన్ని అంశాలు  ఈ సినిమాలో ఉన్నాయని ద‌ర్శ‌కుడు కుమార్ కోట తెలిపారు. వచ్చే నెల చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 




Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.