
నందు విజయ్‌కృష్ణ, రష్మీ గౌతమ్ జంటగా నటిస్తోన్న చిత్రం `బొమ్మ బ్లాక్‌బస్టర్`. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. `మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా` చిత్రాల ద్వారా మంచి సక్సస్ ని సాంధించి ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా `అంటే సుందరానికీ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించిన `నడకుడి రైటంటి సోదరా..` అంటూ సాగే పాటను ఆదివారం రోజున హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. ఈ సందర్బంగా సుధీర్ బాబు మాట్లాడుతూ`` టీజర్ ప్రామిసింగ్‌గా ఉంది. నందు కొత్తగా కనిపిస్తున్నాడు. తన పాత్ర ఇంట్రస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు నాతో రెండో పాటను విడుదల చేయించారు. `మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా` చిత్రాలతో చాలా మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించటం ఈ సాంగ్‌కు ఉన్న ప్రత్యేకత. ఈ చిత్రం నందుకి , దర్శకుడు రాజ్ విరాట్‌కి చాలా పెద్ద బ్రేక్ అవ్వాలని కొరుకుంటున్నాను. అలాగే నిర్మాతలకు సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టి మారు చాలా సినిమాలను నిర్మించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.