వైభవంగా బోనాల పండుగ

ABN , First Publish Date - 2021-03-01T04:04:17+05:30 IST

అడ్డాకుల మండల కేంద్రంలో ఆదివారం బొడ్రాయి బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు.

వైభవంగా బోనాల పండుగ
బొడ్రాయి చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు

అడ్డాకుల, ఫిబ్రవరి 28: అడ్డాకుల మండల కేంద్రంలో ఆదివారం బొడ్రాయి బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆడపడుచులు చేరుకోవడంతో గ్రామం సందడిగా మారింది. గ్రామ వీధులను వేపాకు, మామిడాకు తోరణాలు, పూలతో అలంకరించారు. ఉదయం పసుపు, కుంకుమల నీళ్లతో బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు  చేశారు. శివాంజనేయ శిరిడీసాయి దేవాలయంలో దేవతామూర్తు లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. సాయంత్రం డప్పు వాయిద్యాలతో ప్రతి వీధిలో బోనాలకు స్వాగతం పలికారు. బారులు తీరిన బోనాలతో వీధులన్నీ శోభాయమానంగా మారాయి. ఊరబోనం ముందుకు కదలగా శివసత్తుల నాట్యాలతో బోనాలు బొడ్రాయి దగ్గరకు చేరుకున్నాయి. 


Updated Date - 2021-03-01T04:04:17+05:30 IST