బోనం ఎత్తిన స్పీకర్‌ పోచారం

ABN , First Publish Date - 2021-07-28T05:46:46+05:30 IST

బాన్సువాడ పట్టణంలోని ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు.

బోనం ఎత్తిన స్పీకర్‌ పోచారం
బాన్సువాడలో నెత్తిన బోనం ఎత్తుకున్న స్పీకర్‌ పోచారం

బాన్సువాడ, జూలై 27: బాన్సువాడ పట్టణంలోని ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరై బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ముత్యాల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల్లో బోనాల పండుగ ఒకటని, ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో ఊరూరా బోనాల పండుగ నిర్వహించి, ప్రజలు తమ మొక్కులను తీర్చుకుంటారని ఆయ న అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురియాలని, ప్రజలంతా ఆయురారో గ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుంటారన్నారు. దేశ, విదేశాల్లో కూడా బోనాల పండుగ ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ కార్య క్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ పాత బాలకృష్ణ, సొసైటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, నాయకులు ఎజాస్‌, తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్‌ : సల్లంగా చూడు తల్లి అని బీర్కూర్‌ మండలంలోని ఆ యా గ్రామాల్లో ప్రజలు మంగళవారం గ్రామ దేవతలకు బోనాలను సమర్పించి ప్రార్థించారు. బీర్కూర్‌ మండల కేంద్రంలో మంగళవారం వందలాది మంది మహిళలు బోనాలను తలపై పెట్టుకుని గ్రామ దేవ తల వద్దకు తరలివెళ్లారు. గ్రామ శివారులోని గ్రామ దేవతలకు బోనా లను, నైవేద్యాలను సమర్పించారు.
నాగిరెడ్డిపేట: మండలంలోని వెంకంపల్లి గ్రామంలో గ్రామస్థులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మహి ళలు, భక్తులు బోనాలను ఎత్తుకుని గ్రామంలోని పోచమ్మ ఆలయానికి ఊరేగింపుగా వెళ్లి బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్‌ సుభాకర్‌ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T05:46:46+05:30 IST