బోనమో గంగమ్మ

ABN , First Publish Date - 2022-08-08T06:25:51+05:30 IST

గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మానేరు తీరంలోని గంగామాత ఆలయంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు.

బోనమో గంగమ్మ

 కరీంనగర్‌ కల్చరల్‌, ఆగష్టు 7: గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మానేరు తీరంలోని గంగామాత ఆలయంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. మంకమ్మతోట, రాంనగర్‌, శ్రీనగర్‌కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు బోనాలను భక్తి శ్రద్ధలతో సమర్పించి అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నారు. పసుపు, కుంకుమలు, గాజులు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సంఘ పట్టణ అధ్యక్షుడు పెద్దపల్లి దేవేందర్‌, జిల్లా, పట్టణ ప్రధాన కార్యదర్శులు మోసం అంజయ్య, నాగుల రాజారాం, మూట రాంచందర్‌, పెద్దపల్లి సత్యనారాయణ, మర్రి భీమయ్య, గడప కోటేశ్‌, గడప నాగరాజు, గడప శ్రీకాంత్‌, గాండ్ల సుకన్య, రాచకట్ల శ్రీధర్‌, కార్పోరేటర్‌ పెద్దపల్లి జితేందర్‌ పాల్గొన్నారు.    


  

Updated Date - 2022-08-08T06:25:51+05:30 IST