భక్తిశ్రద్ధలతో పోచమ్మతల్లికి బోనాలు

Jul 28 2021 @ 00:23AM
ఆదిలాబాద్‌లో శోభాయాత్రగా మహాలక్ష్మి ఆలయానికి వెళ్తున్న భక్తులు

ఆదిలాబాద్‌ టౌన్‌, జూలై 27: జిల్లా కేంద్రంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించి పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో భక్తులు బోనాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా మంగళవారం అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఇందులో భాగంగా ఖత్రీ సమాజ్‌ ఆధ్వర్యంలో భక్తులు బోనం కుండలతో శోభాయాత్ర నిర్వహించి మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఇందులో సమాజ్‌ అధ్యక్షుడు ఆదిత్యం కడేష్కర్‌, జనరల్‌ సెక్రటరీ ఉత్తంకండేష్కర్‌, గౌరవాధ్యక్షుడు శంకర్‌, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్‌: మండల రజక సంఘం నాయకులు స్థానిక గంగన్నపేట చెరువు వద్ద మదేలేశ్వర ఆలయం వద్ద బోనాల పండుగను మంగళవారం  ఘనంగా నిర్వహించారు. ఇందులో అధ్యక్షుడు మరికంటి నారాయణ, నెదునూరి అశోక్‌, కాల్వ రవి, కనకయ్య, మహేష్‌, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: