భక్తిశ్రద్ధలతో బోనాలు

Aug 2 2021 @ 23:36PM
కొడంగల్‌: పర్సాపూర్‌లో బోనాలతో వెళ్తున్న మహిళలు

వికారాబాద్‌/తాండూరురూరల్‌/కొడంగల్‌రూరల్‌/ మూడు చింతలపల్లి/ శామీర్‌పేట:  వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ఎన్నెపల్లి వార్డులో సోమవారం బోనాల ఉత్సవాలు పెద్దఎత్తున నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పోచమ్మ తల్లికి సమర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరు మండలంలోని ఖాంజాపూర్‌లో గత రెండు రోజులుగా బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఆదివారం రక్తమైసమ్మకు బోనాలు నిర్వహించగా, సోమవారం గ్రామంలోని మల్లికార్జునస్వామికి బోనాలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి పండుగను ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా కొడంగల్‌ మండలంలోని పర్సాపూర్‌ గ్రామంలో పోచమ్మ దేవతకు బోనాలు సమర్పించారు. అదేవిధంగా మూడుచింతలపల్లిలో జడ్పీటీసీ హరివర్ధన్‌రెడ్డి, కొల్తూరు సర్పంచ్‌ శిల్పాయాదగిరి ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు. హరివర్దన్‌రెడ్డిని గ్రామపెద్దలు సన్మానించారు. దేవర్‌యంజాల్‌లో నిర్వహించిన రంగంలో వారు పాల్గొన్నారు. శిథిలావస్థలోని ఆలయ పునర్నిర్మాణానికి కృషిచేస్తానన్నారు. 

Follow Us on: