
విజయవాడ: అసలు లేని ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు ఎలా జరిగాయో ఆర్కే చెప్పాలని, కాగితాలకే పరిమితం అయిన రింగ్ రోడ్లో అక్రమాలు ఎలా జరిగాయో జగన్ చెప్పాలని టీడీపీ నేత బోండా ఉమ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసుకు పెట్టినా... జగన్ ఏమి పీకలేవన్నారు. వందలాదిగా తప్పుడు కేసులు పెట్టినా...ఒక్కటి అయినా నిరూపించావా? అని ప్రశ్నించారు. హైకోర్టుతో ఇన్నిసార్లు చివాట్లు తిన్న ఏకైక ప్రభుత్వం వైసీపీ అన్నారు. జగన్ మాటలు నమ్మి గతంలో శ్రీలక్ష్మీ వంటి వారు జైలుకి వెళ్లారని గుర్తుచేశారు. ఇప్పుడు మరికొంతమంది అధికారులు కూడా జైలుకి వెళుతున్నారని చెప్పారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా జగన్ తీరు ఉందని విమర్శించారు. జగన్ చేసిన మోసాలను వివరిస్తూ ప్రజల వద్దకు వెళతామని స్పష్టం చేశారు. జగన్‌కి కూడా ఓటమి అర్ధమయ్యే.. కొత్త కుట్రలకు తెర లేపుతున్నారని పేర్కొన్నారు. జగన్ పెట్టే అక్రమ కేసులకు భయపడమని, ప్రజల పక్షాన పోరాడతామన్నారు.
ఇవి కూడా చదవండి