ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-06-26T06:11:09+05:30 IST

జగన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకు ని అఽధికారంలోకి వచ్చాక ఆయా కార్పొరేషన్‌లను నిర్వీర్యం చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నిర్వీర్యం
నిరసన ప్రదర్శనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా

ధర్నాలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా

విద్యాధరపురం, జూన్‌ 25 : జగన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకు ని అఽధికారంలోకి వచ్చాక ఆయా కార్పొరేషన్‌లను నిర్వీర్యం చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం గాంధీనగర్‌లోని ధర్నాచౌక్‌ వ ద్ద ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి రుణాలు ఇవ్వాలని, దళితులకు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పథకాలను పునరుద్ధరించాలని, 200 యూనిట్ల వరకు జగజ్జీవన్‌రామ్‌ ఉచిత విద్యుత్‌ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ సెంట్రల్‌ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా జగన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు చేస్తున్న మోసంపై నినాదాలు చేసి, కరెంటు బిల్లుల కాఫీలను దగ్ధం చేశారు. అనంతరం బొండా ఉమా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. జగన్‌రెడ్డి రద్దు చేసిన టీడీపీ ప్రభుత్వ పథకాలను పునరుద్ధరించేవరకు గడప గడపకు వెళ్లి ప్రభుత్వం బండారాన్ని బయట పెడతామని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నందేటి ప్రేమ్‌, ప్రధాన కార్యదర్శి బెజ్జం జయపాల్‌, రాష్ట్ర నేతలు దాసరి జయరాజు, చల్లగాలి డేవిడ్‌, పి.రాజేష్‌, మద్దాల రుక్మిణి, కె.లూర్దురాజు, బుదాల సురేష్‌, బుదాల అబ్రహాం,గంటా కృష్ణమోహన్‌, గొట్టుముక్కల వెంకీ, నాగమణి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T06:11:09+05:30 IST