Advertisement

మరో రీమేక్‌కు ప్లాన్‌ చేస్తున్న బోనీకపూర్‌

Oct 11 2020 @ 13:12PM

దివంగత నటి శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ అందరికీ సుపరిచితుడే. ఇప్పుడు ఆయన బాలీవుడ్‌లోనే కాదు.. తెలుగు, తమిళంలోనూ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బోని, తెలుగులో  పవన్‌కల్యాణ్‌తో 'పింక్‌' చిత్రాన్ని 'వకీల్‌సాబ్‌'గా రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్‌తో 'వలిమై' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా మరో మలయాళ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేయడానికి హక్కులను దక్కించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. మలయాళంలో హిట్‌ అయిన 'ప్రతి పూవన్‌కొలి' సినిమా రీమేక్‌ హక్కులను బోనీకపూర్‌ దక్కించుకున్నారట. మంజు వారియర్‌ నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ రీమేక్‌లో ఎవరు నటిస్తారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.