గీతాంజలికి బుకర్‌ ప్రైజ్‌

ABN , First Publish Date - 2022-05-28T07:27:44+05:30 IST

హిందీ రచయిత్రి గీతాంజలిశ్రీ ఈ ఏడాది (2022) ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ను గెలుచుకున్నారు.

గీతాంజలికి బుకర్‌ ప్రైజ్‌

టూం ఆఫ్‌ శాండ్‌ అనువాద నవలకు అవార్డు

‘రేత్‌ సమాధి’ పేరుతో హిందీలో 

రచన.. భారతీయ భాషల్లో తొలి పురస్కారం

లండన్‌, మే 27:  హిందీ రచయిత్రి గీతాంజలిశ్రీ ఈ ఏడాది (2022) ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఆమె రాసిన ‘టూం ఆఫ్‌  శాండ్‌’  అనే హిందీ అనువాద నవలకు ఈ పురస్కారం లభించింది. భారతీయ భాషల్లో ‘బుకర్‌’ తొలి పురస్కారం పొందిన అరుదైన ఘనత ఈనవలకు దక్కింది.


 ‘రేత్‌ సమాధి’ పేరుతో హిందీలో 2018లో గీతాంజలి ఈ నవలను రాయగా.. డైసీ రాక్‌వెల్‌ దీనిని ఇంగ్లి్‌షలోకి ‘టూం ఆఫ్‌ శాండ్‌’ గా అనువాదం చేశారు. గురువారం ఇక్కడ జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యకమంలో డైసీతో కలిసి గీతాంజలి ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు కింద బహుమతిగా లభించిన 50 వేల పౌండ్ల నగదును ఇద్దరూ కలిసి పంచుకున్నారు. కాగా, పురస్కారాన్ని అందుకున్న గీతాంజలి భావోద్వేగానికి గురయ్యారు. బుకర్‌ ప్రైజ్‌ వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని అన్నారు. ఈ పురస్కారాన్ని తాను గొప్ప గౌరవంగా తాను భావిస్తానని ఆమె పేర్కొన్నారు. గీతాంజలితోపాటు డైసీ కూడా ఇదే వేదికపై పురస్కారాన్ని స్వీకరించారు. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పూర్‌లో జన్మించిన గీతాంజలి ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. ఆమె మూడు నవలలు రాశారు.


 పలు కథా సంకలనాలను ప్రచురించారు. వీటిలో చాలా రచనలు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, జర్మని, కొరియా భాషల్లోకి తర్జుమా అయ్యాయి. కాగా, ‘రేత్‌ సమాధి’ నవల ఉత్తర భారతదేశానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలి చుట్టూ తిరుగుతుంది  భర్త మరణంతో  ఆమె  తీవ్ర నిరాశానిస్పృహలోకి వెళ్లిపోతుం ది.  దానిని నుంచి బయటపడిన ఆమె ప్రతికూల ప రిస్థితులను అధిగమించి ఎలా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుందో ఈ నవల వివరిస్తుంది. ఈ క్రమంలోనే విభజన సమయంలో వదిలి వచ్చిన గతాన్ని వెతుక్కుంటూ పాకిస్థాన్‌కు వెళ్లాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఈ ప్రయాణాన్ని వర్ణించిన తీరును న్యాయనిర్ణేతలు ఎంతగానో ప్రశంసించారు.

Updated Date - 2022-05-28T07:27:44+05:30 IST