అందని పాఠ్య పుస్తకాలు

ABN , First Publish Date - 2022-07-02T05:54:30+05:30 IST

పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠ్య పుస్తకాలు పూర్తి స్థాయిలో అందలేదు.

అందని పాఠ్య పుస్తకాలు

యూనిఫాం, బూట్లు, కొలతలు తీస్తున్న వైనం

మచిలీపట్నం టౌన్‌, జూలై 1 :  పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠ్య పుస్తకాలు  పూర్తి స్థాయిలో అందలేదు. ఉమ్మడి జిల్లాలో 6,513 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9,09,732 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరికి ఉచితంగా 20,84,612 పాఠ్య పస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటికి 14,98,512 మాత్రమే జిల్లాకు చేరాయి. వీటిల్లో 13,38,881 పాఠ్య పుస్తకాలు మాత్రమే మండలాలకు వచ్చాయి. మిగిలిన 7,45,731 పుస్తకాలు మండలానికి చేరాల్సి ఉంది. కొన్ని మండలాల్లో సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల నుంచి ఉపాధ్యాయులు పుస్తకాలను పాఠశాలలకు తీసుకువెళుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు ప్రైవేట్‌ పాఠశాలలకు విక్రయించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా 12,85,373 పాఠ్య పుస్తకాలకుగాను 5,09,000 మాత్రమే టెక్స్ట్‌బుక్‌ డిపోకు అందాయి. ఇంకా ప్రైవేట్‌ పాఠశాలలకు 7,76,373 పాఠ్య పుస్తకాలు రావల్సి ఉంది. విద్యార్థుల యూనిఫాం, బూట్లు, సాక్సులు, బ్యాగ్‌లు మండలాలకు రానేలేదు. యూనిఫాం విద్యార్థుల కొలతల మేరకు కుట్టించాల్సి ఉంది. 


Updated Date - 2022-07-02T05:54:30+05:30 IST