కలపతో పుస్తకాలు...

ABN , First Publish Date - 2020-12-08T05:14:39+05:30 IST

ఇది వరకు మీరు చాలా గ్రంథాలయాలు చూసే ఉంటారు. కానీ ఈ లైబ్రరీ మాత్రం భిన్నమైనది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇందులో అన్ని కలపతో చేసిన పుస్తకాలు మాత్రమే కనిపిస్తాయి.

కలపతో పుస్తకాలు...

ది వరకు మీరు చాలా గ్రంథాలయాలు చూసే ఉంటారు. కానీ ఈ లైబ్రరీ మాత్రం భిన్నమైనది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇందులో అన్ని కలపతో చేసిన పుస్తకాలు మాత్రమే కనిపిస్తాయి.

 

 అమెరికాలోని యేల్‌ విశ్వవిద్యాలయంలో ఈ గ్రంథాలయం ఉంది. ఇందులో కలపతో చేసిన పుస్తకాలు కనిపిస్తాయి. 


 అంతేకాదు చెట్ల కాండాలను, దుంగలను పుస్తకం ఆకారంలో మలుస్తారు. వాటిపై పేర్లను అందంగా చెక్కుతారు. 


  దూరం నుంచి చూస్తే అవి కాగితం పుస్తకాల మాదిరే కనిపిస్తాయి. వాటిని పట్టుకుని చూస్తే తప్ప చెక్క పుస్తకాలనే విషయం తెలియదు.


 ఈ పుస్తకాల్లో చెట్లకు సంబంధించిన సమాచారం ఉంటుంది. చెట్ల ఆకులు, పువ్వులను కూడా పుస్తకాల్లో భద్రపరుస్తారు. 

Updated Date - 2020-12-08T05:14:39+05:30 IST