అద్దాల బుక్‌స్టాల్‌!

Jun 15 2021 @ 02:59AM

ఆ బుక్‌స్టోర్‌లో అడుగుపెడితే అక్కడున్న పుస్తకాలను చూసి ఆశ్చర్యపోతారు. కొన్ని లక్షల పుస్తకాలు అక్కడ మీకు కనిపిస్తుంటాయి. కానీ అదంతా అద్దాల మహిమ. ఆ విశేషాలు ఇవి...


  • చైనాలోని డ్యుజింగ్యాన్‌లోని ఝాంగ్స్‌హ్యూజ్‌ అనే పుస్తకాల షాపుంది. ఆ షాపు ప్రత్యేకత ఏమిటంటే దాన్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. స్పైరల్‌ మెట్లు, వంపు తిరిగిన గదులు, క్రమపద్ధతిలో అమర్చిన అద్దాలతో ఒక అంతుచిక్కని లైబ్రరీగా కనిపిస్తుంది.
  • చాలా ఏళ్లుగా పుస్తకాల షాపును నిర్వహిస్తున్న యజమాని ఝాంగ్స్‌హ్యూజ్‌ ఇటీవలే బుక్‌స్టాల్‌కు మరమ్మతులు చేయించాడు. ఐదు నెలల పాటు శ్రమించి ఆ బుక్‌స్టోర్‌ను అద్దాల మహల్‌లా తీర్చిదిద్దారు. 
  • ఆ బుక్‌ షాపులో అడుగుపెడితే ఏ ర్యాక్‌ ఎక్కడ మొదలవుతుందో అర్థం కాదు. ఒక పుస్తకం తీద్దామని వెళితే అక్కడ అద్దం చేయికి తగులుతుంది. ఫ్లోర్‌ నుంచి సీలింగ్‌ వరకు పుస్తకాలతో నిండి ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా అంతుచిక్కకుండా ఉంటుంది. ఈ షాపులో 80 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.