విదేశాలకు వెళ్లేవారికి 3 నెలల తర్వాత బూస్టర్‌

ABN , First Publish Date - 2022-05-14T08:19:42+05:30 IST

విదేశాలకు వెళ్లేవారికి 3 నెలల తర్వాత బూస్టర్‌

విదేశాలకు వెళ్లేవారికి 3 నెలల తర్వాత బూస్టర్‌

న్యూఢిల్లీ, మే 13: విద్య, ఉద్యోగ, వ్యాపార, పర్యాటక అవసరాల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి  కొవిడ్‌టీకా బూస్టర్‌ డోసును అందించే వ్యవధిని కేంద్ర ఆరోగ్యశాఖ తగ్గించింది. రెండో డోసును తీసుకున్న 3 నెలల విరామం తర్వాత బూస్టర్‌ను వేయించుకోవచ్చని ప్రకటించింది. ఈమేరకు కొవిన్‌ పోర్టల్‌లో మార్పులు చేస్తామని వెల్లడించింది. మిగతా వారంతా రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. 

Read more