కరోనా ముప్పును పదింతలు తగ్గించే బూస్టర్ డోసు: అధ్యయనంలో వెల్లడి!

ABN , First Publish Date - 2021-09-18T13:49:45+05:30 IST

వృద్ధులలో కరోనా ముప్పును బూస్టర్ డోసు పదింతలు...

కరోనా ముప్పును పదింతలు తగ్గించే బూస్టర్ డోసు: అధ్యయనంలో వెల్లడి!

జరూసలెం: వృద్ధులలో కరోనా ముప్పును బూస్టర్ డోసు పదింతలు తగ్గిస్తుందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడయ్యింది. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు. దీని ప్రకారం ఫైజర్ కరోనా టీకా బూస్టర్ డోసు తీసుకున్న వారిలో కరోనా వ్యాప్తి, తీవ్రమైన కోవిడ్ లక్షణాలు కనిపించలేదు. 


ఈ అధ్యయనం కోసం బూస్టర్ డోసు తీసుకున్నవారు.... బూస్టర్ డోసు తీసుకోని వారు అనే రెండు గ్రూపులను తయారు చేసి, వారిపై అధ్యయనం చేశారు. ఈ రెండు బృందాలలో బూస్టర్ డోసు తీసుకున్నవారిలో 11.3 శాతం మేరకు కరానా ముప్పు తక్కువగా కనిపించింది. ఈ అధ్యయనంలో 60 ఏళ్లు దాటిన 11 లక్షల మంది గణాంకాలను పరిగణలోకి తీసుకున్నారు.  రెండు టీకాలు తీసుకున్న రెండు నెలల తరువాత కరోనాతో పోరాడే యాంటీబాడీలు క్షీణిస్తున్నాయి. అదే వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీకున్నట్లయితే కరోనా నుంచి వారికి మరిన్ని రెట్ల రక్షణ లభిస్తున్నదని అధ్యయనంలో తేలింది. కాగా ప్రస్తుతం ధనికదేశాలన్నీ తమ దేశంలోని ప్రజలకు బూస్టర్ డోసు టీకా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. 

Updated Date - 2021-09-18T13:49:45+05:30 IST