బూస్టర్‌గా ముక్కు టీకా 3వ దశ ట్రయల్స్‌కు అనుమతి

ABN , First Publish Date - 2022-01-29T08:29:48+05:30 IST

దేశంలో వారం రోజులుగా కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. నాలుగు రోజుల నుంచి దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు తగ్గుతుండటం కూడా థర్డ్‌ వేవ్‌ క్షీణతకు సూచికగా భావిస్తున్నారు. వారం నుంచి పాజిటివిటీ రేటు స్థిరంగా ఉంటోంది. వీటన్నిటిని బట్టి చూస్తే......

బూస్టర్‌గా ముక్కు టీకా  3వ దశ ట్రయల్స్‌కు అనుమతి

భారత్‌ బయోటెక్‌కు 

డీసీజీఐ పచ్చజెండా 


న్యూఢిల్లీ, జనవరి 28: దేశంలో వారం రోజులుగా కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. నాలుగు రోజుల నుంచి దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు తగ్గుతుండటం కూడా థర్డ్‌ వేవ్‌ క్షీణతకు సూచికగా భావిస్తున్నారు. వారం నుంచి పాజిటివిటీ రేటు స్థిరంగా ఉంటోంది. వీటన్నిటిని బట్టి చూస్తే... దేశంలో కొవిడ్‌ మూడో వేవ్‌ ఇప్పటికే గరిష్ఠ స్థాయిని చేరుకున్నట్టుగా భావించవచ్చని నిపుణులు అంటున్నారు. గత గురువారం (జనవరి 20) 3.47 లక్షల కేసుల నమోదయ్యాయి. మూడో వేవ్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధికం. వారం రోజుల నుంచి 16-17 శాతం మధ్యే పాజిటివిటీ రేటు నమోదవుతోంది. గతవారంతో పోలిస్తే 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తక్కువ సంఖ్యలో పాజిటివ్‌ కేసులను రిపోర్ట్‌ చేస్తున్నాయి. ఫలితంగా జాతీయస్థాయిలో కూడా కొత్త కేసుల సంఖ్య తగ్గుతోంది. అయితే కేరళలో ఇంకా అధిక సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య అంత వేగంగా తగ్గడం లేదు. కాకపోతే కేసుల్లో పెరుగుదల చాలావరకు ఆగింది.

Updated Date - 2022-01-29T08:29:48+05:30 IST