ఓసీ 3 బొగ్గు వచ్చేసింది..

ABN , First Publish Date - 2021-03-06T05:36:49+05:30 IST

ఓసీ 3 బొగ్గు వచ్చేసింది..

ఓసీ 3 బొగ్గు వచ్చేసింది..

భూపాలపల్లి ఏరియాలో 3వ ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు  

త్వరలో ఉన్నతాధికారుల చేతులమీదుగా ప్రారంభం 


చెల్పూరు, మార్చి 5 : భూపాలపల్లి ఏరియా సింగరేణి పరిధి గణపురం మండలం మాధవరావుపల్లి సమీపంలో ఓపెన్‌కాస్టు 3- ప్రాజె క్టులో బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ ప్రాజెక్టు పనులు సుమారు 130 ఎకరాలలో చేపట్టగా అం దులో 91 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాజెక్టు 30సంవత్సరాల వరకు కొనసాగుతుందని చెబుతున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో భూమి పూజ నిర్వహించిన అనంతరం జూలైలో మట్టి తవ్వకాలు చేపట్టారు. అయితే టెండరు చేజిక్కించుకున్న సదరు కాంట్రాక్టరు పనులు ఆలస్యం చేయడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. కానీ ఎట్టకేలకు మార్చిలో బొగ్గు వెలికితీసేందుకు మార్గం సుగమం చేశారు. మట్టి తవ్వకాలు కేవలం 40మీటర్ల లోతు పూర్తి కాగానే బొగ్గు బయటపడడంతో అధికారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి వీలైనంత తొందరలో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే వార్షిక సంవత్సరం పూర్తి కావస్తుండగా నూతన వార్షిక సంవత్సరం (2021 -22) ఏప్రిల్‌ 1 న నుంచి ప్రారంభం కానుండగా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 

Updated Date - 2021-03-06T05:36:49+05:30 IST