ఫిట్‌మెంట్‌తో పాటు అన్ని డిమాండ్‌లను సీఎం వద్ద ప్రస్తావిస్తాం: బొప్పరాజు

ABN , First Publish Date - 2022-01-06T17:33:12+05:30 IST

వాడ: ఫిట్‌మెంట్‌తో పాటు అన్ని డిమాండ్‌లను సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావిస్తామని బొప్పరాజు అన్నారు.

ఫిట్‌మెంట్‌తో పాటు అన్ని డిమాండ్‌లను సీఎం వద్ద ప్రస్తావిస్తాం: బొప్పరాజు

విజయవాడ: ఫిట్‌మెంట్‌తో పాటు అన్ని డిమాండ్‌లను సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావిస్తామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై గురువారం ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, తమిళనాడులో ఎక్కువ ఫిట్ మెంట్ ఇచ్చారని, 27 శాతం ఐఆర్ ఇస్తున్నారన్నారు. ఏపీలో అంతకంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఉండాలని కోరతామన్నారు. 27 శాతం కన్నా తక్కువ ఫిట్ మెంట్ ఇవ్వడం వారికి మర్యాద కాదన్నారు. 27 శాతం కంటే తక్కువ ఇస్తే ఉద్యోగుల జీతాలు తగ్గుతాయన్నారు. సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపైనా సీఎం జగన్ వద్ద చర్చిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-06T17:33:12+05:30 IST