AP News: సంక్షేమాలంటూ.. బాదేస్తున్నారు: బొరగం శ్రీనివాసులు

ABN , First Publish Date - 2022-08-25T01:43:29+05:30 IST

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): వైసీపీ పాలనపై పోలవరం టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పథకాల పేరుతో ప్రజలను మోసం

AP News: సంక్షేమాలంటూ.. బాదేస్తున్నారు: బొరగం శ్రీనివాసులు

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): వైసీపీ (YSRCP) పాలనపై పోలవరం (Polavaram) టీడీపీ (TDP) నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. సంక్షేమ పథకాల కోసం అప్పులు తెచ్చి.. వాటిని తిరిగి రాబట్టు కునేందుకు పన్నులు, కరెంటు, బస్సు చార్జీలు పెంచేశాడని ధ్వజమెత్తారు. కొయ్యలగూడెం మండలం బొడిగూడెం, అంకాలగుడెం గ్రామాల్లో నిర్వహిస్తున్న  ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీనివాసులు వైసీపీ అరాచకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పెంచిపెట్టారు 


ఇచ్చేది గొంరంత.. దోచేది కొండంత..

‘‘వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. అప్పులు తప్ప అభివృద్ధి లేదు. నవరత్నాలంటూ.. వివిధ రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. పథకాల పేరిట ఇచ్చేది గొంరంతయితే.. తిరిగి జనం నుంచి దోచేది కొండంత. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా.. టీడీపీ అధికారంలోకి రావడంతోనే సాధ్యం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబును ఆదరించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వాడపల్లి నాగార్జున, మండల ప్రధాన కార్యదర్శి కర్రి రాంబాబు,  పార్టీ గ్రామ అధ్యక్షుడు నక్కా రవి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పారెపల్లి రామారావు,  పార్టీ మండల ఉపాధ్యక్షులు వేమా శ్రీను,  అతిరస సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శుక్లబోయిన శ్రీను, పార్టీ పట్టణ అధ్యక్షుడు జ్యేష్ఠ రామకృష్ణ, నీలం నాగేశ్వరరావు, బొమ్మ రామ గంటలయ్య, రాచూరి మధన్, ఉప్పాటి వెంకట్రావు, మలిపుటీ శంకర్, మిరియాల రవి కుమార్, నిమ్మగడ్డ మహేష్, గంటా సుబ్రహ్మణ్యం, చిడిపి రవికుమార్, కూనపం సురేంద్ర,  తెలుగుమహిళా మండల అధ్యక్షురాలు ఆకుల అరుణ, తెలుగుమహిళా మండల ఉపాధ్యక్షురాలు కాకి లక్ష్మి,  తెలుగుమహిళా మండల మహిళా కార్యదర్శి పెండ్యాల రమాదేవి, చెరుకూరి రమ్య, టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధికార ప్రతినిధి పారేపల్లి పవన్, టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షులు రాకేష్ చందన్ తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-08-25T01:43:29+05:30 IST