బోరు బావిలో పడ్డ బాలుడు.. క్షేమంగా బయటకు తీసిన స్థానికులు

ABN , First Publish Date - 2022-07-07T21:55:33+05:30 IST

బోరు బావిలో పడ్డ ఓ బాలుడిని స్థానికులు ప్రాణాలతో కాపాడారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గోలగుంటకు చెందిన

బోరు బావిలో పడ్డ బాలుడు.. క్షేమంగా బయటకు తీసిన స్థానికులు

ద్వారకాతిరుమల: బోరు బావిలో పడ్డ ఓ బాలుడిని స్థానికులు ప్రాణాలతో కాపాడారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గోలగుంటకు చెందిన జస్వంత్(9) అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 400 అడుగులు లోతు ఉన్న బోరు బావిలో పడిపోయాడు. అయితే బాలుడు 30 అడుగుల లోతులో రాయిపై చిక్కుకున్నాడు. జస్వంత్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రదేశాలు వెతికారు. అయినా బాలుడి ఆచూకి చిక్కలేదు. బోరుబావిలో నుంచి జస్వంత్ కేకలు వేయడంతో స్థానికులు అతనిని గుర్తించారు. వెంటనే హుటాహుటిన తాళ్ల సహాయంతో బోరు బావిలోకి దిగి బాలుడిని ప్రాణాలతో రక్షించి బయటకు తీశారు. సుమారు 5 గంటల పైనే జస్వంత్ బోరు బావిలో బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది  ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రాణాలతో జస్వంత్ బయటపడటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-07-07T21:55:33+05:30 IST