భారత్‌లో బ్రిటన్ ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు

ABN , First Publish Date - 2022-04-20T21:33:03+05:30 IST

బ్రిటన్ ప్రధానమంత్రిగా బోరిస్ ఇంత వరకు భారత్‌కు రాలేదు. అంతే కాదు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం బోరిస్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి బ్రిటన్‌కు వెళ్లలేదు. ఆయన గతంలోనే భారత్‌కు రావాల్సి ఉంది...

భారత్‌లో బ్రిటన్ ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌తో బ్రిటన్ ప్రధాని ఎన్ని రోజులు పర్యటిస్తారు, ఏయే తేదీల్లో పర్యటిస్తారు, ఎక్కడ పర్యటిస్తారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 21, 22 తేదీల్లో బోరిస్ పర్యటన ఉంటుందని బుధవారం ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 21 ముందుగా ఆయన అహ్మదాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారట. అనంతరం ఏప్రిల్ 22న రాజ్‌ఘాట్‌కు వెళ్లి గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించి, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్‌ను కలుసుకోనున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమై తిరిగి లండన్ వెళ్లనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.


బ్రిటన్ ప్రధానమంత్రిగా బోరిస్ ఇంత వరకు భారత్‌కు రాలేదు. అంతే కాదు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం బోరిస్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి బ్రిటన్‌కు వెళ్లలేదు. ఆయన గతంలోనే భారత్‌కు రావాల్సి ఉంది. గతేడాది జనవరిలో సైతం గణతంత్ర దినోత్సవానికి భారత్‌ ఆహ్వానించగా బ్రిటన్‌లో కరొనా పెరుగుదల కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. ఈసారి భారత్‌‌లో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రద్దయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు భారత పర్యటన ఖారారైంది.

Updated Date - 2022-04-20T21:33:03+05:30 IST