సమావేశంలో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి
బీజేపీ, టీఆర్ఎస్ ధర్నాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి
జగిత్యాల అర్బన్, మార్చి 26: ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వా ల్సిన ప్రభుత్వాలే, ప్రజలపై భారం మోపడం దురదృష్టకరమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని స్థానిక ఇందిరాభవన్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఎనిమిదేళ్ల పాల నలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ప్రాణహి త చే వెళ్ల రీజైనింగేనని, ఏపీ పునర్విభజన చట్టంలో నూతన ప్రాజెక్టుల ని ర్మాణానికి అనుమతుల్లో ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ప్రా జెక్టును రీడిజైనింగ్ చేశారన్నారు. పేర్లు మార్చి పథకాలను కొనసాగిం చడం మినహా ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. పెట్రోల్, డీజిల్‌పై ప న్నుల భారం వేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 2014లో యూపీఏ హయాంలో పెట్రోల్‌పై కేవలం 14శాతం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీవిధించగా, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం 35 శాతం పన్ను విధిస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డీజిల్‌పై 12.5 శాతం పన్ను ఉం డగా, నేడు 27శాతానికి పెంచారన్నారు. నాటి క్రూడాయిల్ ధర నేటికీ అంతే ఉండగా పన్నులు పెంచడం దారుణం అని జీవన్‌రెడ్డి విమర్శిం చారు. కూడ్రాయిల్ ధరలు ప్రభుత్వాల చేతిలో లేకపోయినా, పన్నుప రిమితి ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంద న్నారు. రైతాంగానికి మద్దతు ధర కల్పించకుండా ఒకరిపై ఒకరు ఆరో పణలు చేసుకోవడంహాస్యాస్పదం అని, బీజేపీ, టీఆర్ఎస్ ధర్నాలు చూ సి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. అక్కడ కేంద్రం సి లండర్ ఛార్జీలు, ఇక్కడ రాష్ట్రంలో విద్యుత్ ధరలను పెంచి ప్రజల జీవి తాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సి లిండర్పై రూ. 50పెరిగితే వైయస్ఆర్ హయాంలో 50రూ. రాయితీ కల్పించి భారం తగ్గించిన విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రిహరీష్రా వు మర్చిపోవద్దన్నారు. గడిచిన 20ఏళ్లలో ఏనాడు100 యూనిట్లలోపు కరెంటు వినియోగానికి ఛార్జీలు పెంచలేదని, నేడు స్వరాష్ట్రంలో 50 యూనిట్ల నుంచి పెంచిన తీరును ప్రజలు గమనించాలన్నారు. ప్రభు త్వం బాకీఉన్న రూ.12వేల కోట్ల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించి ప్రభుత్వచిత్తశుద్ధిని చాటుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరిలక్ష్మణ్ కుమార్, టీపీసీసీ ఆర్గనె జింగ్ సెక్రటరీ బండ శంకర్, మాజీ మున్సిపల్ ఛైర్మెన్ గిరి నాగ భూ షణం, మాజీ కౌన్సిలర్లు గాజుల రాజేంధర్, పుప్పాల అశోక్, యూ త్కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుంఢా మధు, నాయకులు గంగారెడ్డి, గుం టి జగదీశ్వర్, మునీంధర్రెడ్డి, మహి పాల్, నెహాల్, బాస ప్రకాశ్, సలీం తదితరులున్నారు.
ఫకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఒత్తిడి పెంచేందుకు, సామాన్యుడిపై ధరల భారం తగ్గించే దిశగా ఈ నెల 29 మంగళవారం రోజున జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. ప్రజలు రాజకీయాలకు అతీతంగా తరలివచ్చి, ధర్నాకు మద్దతు ప్రకటించి, విజయవంతం చేయాలనికోరారు.