ఘనంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి జన్మదినం

ABN , First Publish Date - 2022-04-07T05:57:33+05:30 IST

మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి పుట్టినరోజు వేడుకలను బూచేపల్లి, వైసీపీ అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి జన్మదినం
కేక్‌ కట్‌ చేసి తల్లి వెంకాయమ్మకు తినిపిస్తున్న శివప్రసాదరెడ్డి


చీమకుర్తి, ఏప్రిల్‌ 6 : మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి పుట్టినరోజు వేడుకలను బూచేపల్లి, వైసీపీ అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని బూచేపల్లి గృహంలో అభిమానుల సమక్షంలో శివప్రసాదరెడ్డి కేక్‌ కట్‌ చేసి తల్లి జడ్పీచైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, సతీమణి నందినిలకు తిని పించారు. పలువురు నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చీమకుర్తి పట్టణంలో పలు ప్రాంతాల్లో అభిమానులు కేక్‌కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఎంఎస్‌ఆర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ అధినేతలు మన్నం శ్రీధర్‌బాబు, రామకృష్ణ, వేణుగో పాల్‌ మినరల్స్‌ పల్లపోలు వేణుగోపాలరెడ్డి, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్‌ మేడగం రామకృష్ణారెడ్డి, మస్తాన్‌రెడ్డి తదితరులు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.


Updated Date - 2022-04-07T05:57:33+05:30 IST