ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసిన చిన్నోడు.. అతడు చెప్పింది విని అధికారులు షాక్.. వైరల్ అవుతున్న ఫొటో

ABN , First Publish Date - 2022-07-15T02:29:02+05:30 IST

ఫ్లోరిడాకు చెందిన పోలీసు అధికారులు సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అది చూసి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అధికారులపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో చిన్నోడి అమాయకత్వాన్ని చూసి పడి పడి న

ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసిన చిన్నోడు.. అతడు చెప్పింది విని అధికారులు షాక్.. వైరల్ అవుతున్న ఫొటో

ఎన్నారై డెస్క్: ఫ్లోరిడాకు చెందిన పోలీసు అధికారులు సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అది చూసి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అధికారులపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో చిన్నోడి అమాయకత్వాన్ని చూసి పడి పడి నవ్వుకుంటున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఫ్లోరిడాలోని ఆరెంజ్ కౌంటీకి చెందిన షరీఫ్ కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం 1.45గంటలకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్‌కాల్‌ లిఫ్ట్ చేసిన అధికారులు.. అవతలి వైపు నుంచి ఓ బుడ్డోడు చెప్పింది విని షాకయ్యారు. తనకు డైనోసార్ కావాలని అడగడంతో అవాక్కయ్యారు. చిన్నోడి అవసరాన్ని గుర్తించిన అధికారులు.. పెద్ద మనసు చాటుకున్నారు. వెంటనే ఓ అధికారి ఆ చిన్నోడి ఇంటికి బయల్దేరాడు. దారి మధ్యలో రెండు డైనోసార్ బొమ్మలను కొనుగోలు చేసి.. వాటిని తీసుకెళ్లి చిన్నోడి చేతిలో పెట్టాడు. అనంతరం ఆ బుడ్డోడితో కలిసి ఫొటో తీసుకున్నాడు. ఆ ఫొటోను అధికారులు ఈ నెల 13న సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో తమ చిన్నారులు చేసిన అల్లరి పనులను కూడా పంచుకుంటున్నారు. 


Updated Date - 2022-07-15T02:29:02+05:30 IST