Viral Video: వామ్మో.. ఈ పిల్లాడికి ఎంత ధైర్యం.. ఒంటి చేత్తో పాము తలను అమాంతం పట్టుకుని..

ABN , First Publish Date - 2022-10-07T20:29:58+05:30 IST

ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మందిని భయపెట్టే జీవులలో పాములు అగ్రస్థానంలో ఉంటాయి.

Viral Video: వామ్మో.. ఈ పిల్లాడికి ఎంత ధైర్యం.. ఒంటి చేత్తో పాము తలను అమాంతం పట్టుకుని..

ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మందిని భయపెట్టే జీవులలో పాములు అగ్రస్థానంలో ఉంటాయి. పామును చూస్తే ఎంతటి వారైనా భయపడతారు. అందులోనూ కింగ్ కోబ్రా అంటే చాలా విషపూరితమైనది. అలాంటిది ఓ కుర్రాడు కింగ్ కోబ్రాకే చుక్కలు చూపించాడు. నడిరోడ్డు మీద వేగంగా వెళ్తున్న పామును పట్టుకున్నాడు. అది పడగ ఎత్తి కాటేయడానికి ప్రయత్నిస్తున్నా వెరవకుండా దానిని పట్టుకున్నాడు. 


ఆ బాలుడి ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా, కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన సర్పం. అది కుట్టిన వ్యక్తి 15 నిమిషాల్లో చనిపోతాడు. ప్రాణం నిలబడినా పక్షవాతం రావడం మాత్రం ఖాయం అని చెబుతారు. మనుషులనే కాదు.. ఏనుగులను కూడా కింగ్ కోబ్రా తన కాటుతో చంపెయ్యగలదు. 

Updated Date - 2022-10-07T20:29:58+05:30 IST