Esports : 19 ఏళ్లకే దేశానికి ప్రాతినిధ్యం.. పంజాబ్ కుర్రాడి ఘనత

ABN , First Publish Date - 2022-05-08T22:07:19+05:30 IST

చంఢీగడ్ : అంతర్జాతీయ వేదికపై ఒక దేశం తరపున ప్రాతినిధ్యం వహించడమంటే ఏ క్రీడాకారుడికైనా గర్వకారణమే. ఈ ఘనతను 19 ఏళ్ల చిరుప్రాయంలో సాధించాడు చంఢీగడ్ కు చెందిన

Esports : 19 ఏళ్లకే దేశానికి ప్రాతినిధ్యం.. పంజాబ్ కుర్రాడి ఘనత

చంఢీగడ్ : అంతర్జాతీయ వేదికపై ఒక దేశం తరపున ప్రాతినిధ్యం వహించడమంటే ఏ క్రీడాకారుడికైనా గర్వకారణమే. ఈ ఘనతను 19 ఏళ్ల చిరుప్రాయంలో సాధించాడు చంఢీగడ్ కు చెందిన Charanjot singh. స్నేహితుల ఇళ్లలో వీడియో గేమ్స్ ఆడిన అతడు.. ఇప్పుడు భారత్ కు తొలి Esports (వీడియో గేమ్స్ పోటీ) పతకం సాధించడంపై కన్నేశాడు. FIFA 2022కి ఇద్దరు ప్లేయర్స్ లో ఒకడిగా చరణ్ జ్యోత్ ఎంపికయ్యాడు. అంతేకాకుండా 18 మంది సభ్యులుండే ఈస్పోర్ట్స్ లో ఒక సభ్యుడిగా ఎంపిక చేస్తూ ఈస్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గతవారమే ప్రకటన చేసింది. దీంతో  వచ్చే ఏడాది చైనాలోని హంగ్ జోలో జరగబోయే 2022 ఏసియన్ గేమ్స్ లో చరణ్ జ్యోత్ పాల్గొననున్నారు. అంకితభావం, పట్టుదలతో భారత్ కు తొలి మెడల్ అందించేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పాడు. చంఢీగడ్ లోని పీఎంఎల్ ఎస్ కాలేజీలో చదువుతున్న చరణ్ జ్యోత్ కి ఒకప్పుడు సొంత గేమింగ్ సెటప్ కూడా ఉండేది కాదు. స్నేహితుల ఇంటికి వెళ్లి ఆడేవాడు. ఈ కారణంగానే స్నేహితుల ఇళ్ల వద్ద ఎక్కువ సమయం గడిపేవాడు. సొంతంగా గేమింగ్ సెటప్ కావాలని తల్లిదండ్రులు మంజీత్ సింగ్, జస్కిరత్ కౌర్ లను ఇటివలే కోరాడు.


అమ్మానాన్న గర్వపడుతున్నారు

వాస్తవానికి ఏసియన్ గేమ్స్ ఈ ఏడాదే జరగాల్సి ఉంది. కానీ చైనాలో కొవిడ్ మహమ్మారి ఉధృతి కారణంగా 2023కు వాయిదాపడ్డాయి. ఏసియన్ గేమ్స్ లో మెడల్ సాధించడంపై చరణ్ జ్యోత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. గేమ్స్ వాయిదాపడడం సానుకూలమేనని అన్నాడు. ఏసియన్ గేమ్స్ లో తొలిసారి ఈస్పోర్ట్స్ ను ఒక మెడల్ ఈవెంట్ గా ప్రవేశపెడుతుండడం చాలా ప్రత్యేకంగా, సంతోషంగా ఉందని చరణ్ జ్యోత్ అన్నాడు. దేశం తరపున ప్రాతినిధ్యం వహించడం అంటే చాలా ప్రత్యేకమని అన్నాడు. తన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు గర్వపడుతున్నారని చెప్పాడు. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి భారత్ కు పతకం అందించడమే తన లక్ష్యమని చరణ్ జ్యోత్ తెలిపాడు. ఇదంత సులభమైన విషయం కాదు. కానీ కష్టపడాల్సి ఉందన్నాడు. గేమ్స్ వాయిదాపడడం కాస్త నిరాశగా అనిపించిన మంచిదేనని పేర్కొన్నాడు. సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం దొరికిందన్నాడు. కాగా 2021 ఫిఫా సీజన్ లో భారత్ 22వ ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Read more