ఆన్‌లైన్ డేటింగ్ ద్వారా యువతిని ప్రేమించిన యువకుడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిని పిలిచి బ్లాక్ మెయిల్.. అక్కడ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-07T09:10:16+05:30 IST

ఆన్‌లైన్ డేటింగ్ ద్వారా ఒక యువకుడికి ఒక యువతి పరిచయమైంది. కొంతకాలం చాటింగ్, ఫోన్‌లో మాట్లాడిన తరువాత ఇద్దరూ కలుసుకోవాలనుకున్నారు. ఒకరోజు యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను కలవడానికి వెళ్లిన యువకుడికి తేరుకోలేని షాక్ తగిలింది. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్ అని తెలిసింది...

ఆన్‌లైన్ డేటింగ్ ద్వారా యువతిని ప్రేమించిన యువకుడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిని పిలిచి బ్లాక్ మెయిల్.. అక్కడ ఏం జరిగిందంటే..

ఆన్‌లైన్ డేటింగ్ ద్వారా ఒక యువకుడికి ఒక యువతి పరిచయమైంది. కొంతకాలం చాటింగ్, ఫోన్‌లో మాట్లాడిన తరువాత ఇద్దరూ కలుసుకోవాలనుకున్నారు. ఒకరోజు యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను కలవడానికి వెళ్లిన యువకుడికి తేరుకోలేని షాక్ తగిలింది. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్ అని తెలిసింది. పైగా యువకుడిని ఇంటికి పిలిచి అతడి వద్ద ఉన్న డబ్బులు దోచుకొని.. అతడి నగ్నంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.


ఢిల్లీలోని సౌత్ డిస్ట్ర్కిట్ ప్రాంతంలో నివసించే హిమాన్షు అనే యువకుడు ఒక డేటింగ్ యాప్ ద్వారా హినా ఖాన్ అనే యువతి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఒకరోజు ఇద్దరూ కలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఒకరోజు హినా ఖాన్ తన ఇంట్లో ఒంటరిగా ఉన్నానని వెంటనే రావాలని హిమాన్షుకి చెప్పింది. హినాను నేరుగా కలుసుకోవాలని హిమాన్షు కూడా అక్కడ ఎంతో ఆశగా వెళ్లాడు. కానీ అక్కడికి చేరుకోగానే ఎవరో వెనుక నుంచి తలపై కొట్టారు. ఆ తరువాత హిమాన్షుని ఒక గదిలో పెట్టి బంధించారు. 


హిమాన్షు కాస్త తేరుకొని చూడగా.. అక్కడ హినా ఖాన్‌తో మరో యువతి కూడా ఉంది. వారిద్దరూ అసలు మహిళలే కాదు. ఆ ఇద్దరూ ట్రాన్స్‌జెండర్స్(అమ్మాయిగా లింగమర్పిడి చేసుకున్న యువకులు). డేటింగ్ యాప్‌లో అమ్మాయిలుగా పరిచయం చేసుకొని యువకులను మోసం చేసేవారు. ఈ క్రమంలో హిమాన్షుని కూడా అలాగే ప్రేమ వ్యవహారం నడిపించి.. ఇంటికి పిలిచారు. ఇంటికి రాగానే అతడిని బంధించి.. అతని వద్ద ఉన్న డబ్బులు దోచుకున్నారు. పేటియం ద్వారా అతని బ్యాంకు ఖాతాని ఖాళీ చేశారు. అంతటితో ఆగక.. హిమాన్షుని బట్టలు తీసి అతడి నగ్న వీడియోలు తీశారు. ఈ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అతిన వద్ద డబ్బులు వసూలు చేశారు. 


హినా ఖాన్ బ్లాక్ మెయిలింగ్‌, చిత్రహింసలు భరించలేక ఒకరోజు హిమాన్షు తన స్నేహితులతో తన బాధను చెప్పుకున్నాడు. స్నేహితులు ధైర్యం చెప్పడంతో హిమాన్షు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హినా ఖాన్ ఉంటున్న బిల్డింగ్ ఫ్లాట్‌పై దాడి చేసి ఆ ఇద్దరు దొంగ ట్రాన్స్ జెండర్స్‌ని అరెస్టు చేశారు.


Updated Date - 2022-04-07T09:10:16+05:30 IST