పండగపూట విషాదం

ABN , First Publish Date - 2022-10-04T06:16:23+05:30 IST

పండగపూట విషాదం

పండగపూట విషాదం
కుమారుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి




1234 1234 1234 1234 

కుమారుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి కుమారుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి 

- ఉర్సుగుట్ట చెరువులో ఈతకు వెళ్లి బాలుడి మృతి

- మరొకరు గల్లంతు.. 

 కరీమాబాద్‌, అక్టోబరు 3: పండగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత సర దా ఓ విద్యార్థిని బలిగొనగా, మరో బాలుడు గల్లంతయ్యాడు. ప్రమాదం నుంచి ఇం కో బాలుడు బయటపడ్డాడు. హృదయ విదారకమైన ఈ ఘటన వరంగల్‌ ఉర్సు గుట్ట రంగసముద్రం చెరువు వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. 

నగరంలోని గోవిందరాజుల గుట్ట ప్రాంతానికి చెందిన ముగ్గురు పిల్లలు మా టూరి రాంచరణ్‌ (11), రిశ్విక్‌(11), యశ్వంత్‌కుమార్‌లు సరదాగా ఈత కొట్టేందు కు సోమవారం ఉదయమే తమ ఇంట్లోంచి బయల్దేరారు. జెమిని టాకీస్‌ దగ్గర అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు. అనంతరం మధ్నాహ్నం ఉర్సుగు ట్ట రంగసముద్రం చెరువులోని మత్తడి వద్దకు చేరుకున్నారు. మత్తడి పోస్తున్న నీటిలో ఆడుతూ తర్వాత చెరువులోకి దిగారు. చెరువు పూర్తిస్థాయిలో నిండిపోవడం, మాటూరి రాం చరణ్‌, రిశ్విక్‌లు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. మరో బాలుడు యశ్వంత్‌ కుమార్‌ ఒడ్డుకు చేరుకొని బతికి బయటపడ్డాడు. కాగా, చెరువులో మునిగిన కాసేపటికే రాం చరణ్‌ విగతజీవిగా నీటిలో తేలియాడుతూ కనిపించాడు. రిశ్విక్‌ మాత్రం చెరువులో గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి చెరువులో వెతికించిన రిశ్విక్‌ ఆచూకీ లభించలేదు. రాంచరణ్‌ మృతదేహాన్ని పోలీసులు ఎంజీఎంకు తరలించారు. గల్లంతైన రిశ్విక్‌కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

- చిన్నా లేరా.. అమ్మను వచ్చాను..

‘ఎవరైన నా కొడుకును కాపాడండయ్యా.. నా కొడుకు శరీరం ఇంకా వేడిగానే ఉంది.. చిన్నా లేరా అమ్మను వచ్చాను, పండగ పూట ననాకు గర్భశోకాన్ని మిగిల్చావా’ అంటూ రాంచరణ్‌ తల్లి హేమలత కుమారుడిని గుండెలకు హత్తుకుని విలపించడం అక్కడివారిని కంటతడి పెట్టించింది. నగరంలోని బార్‌షాపులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మాటూరి శ్రీనివాస్‌కు భార్య హేమలత, కూతురు, కుమారుడు రాంచరణ్‌ ఉన్నారు. రాంచరణ్‌ నగరంలోని గోల్డెన్‌ త్రిషోల్డ్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కలిసే వచ్చారా..

ఈతకు వెళ్లిన రాంచరణ్‌, రిశ్విక్‌, యశ్వంత్‌ కుమారులు స్నేహితులా.. లేక ఒకే ప్రాంతానికి చెందిన వారా అన్నది తెలియాల్సి ఉంది. వీరంతా అన్నదాన కార్యక్రమంలో భోజనం చేసి వెళ్లినట్టు తెలుస్తోంది. అందరూ కలిసే చెరువు వద్దకు వెళ్లారా.. లేక వేర్వేరుగా వెళ్లారా, చెరువు వద్దకు ఎలా వెళ్లారన్న వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. 


Updated Date - 2022-10-04T06:16:23+05:30 IST