
కర్నూలు: జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో బాలుడి హత్య కలకలం సృష్టించింది. ఐదు సంవత్సరాల లోపు బాలుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. గ్రామానికి చెందిన సూర్య అనే బాలుడు గత నెల 30వ తేదీన అంగన్‌వాడి స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బాలుడి తల్లి మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు. మృతి చెందిన బాలుడు, తప్పిపోయిన బాలుడు ఒకరేనా కాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి