తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించిన పోలీసులు

ABN , First Publish Date - 2021-10-26T06:43:58+05:30 IST

కొత్తపల్లి, అక్టోబరు 25: ఇంటి నుంచి ఆడుకుంటూ వచ్చి తప్పిపోయిన బాలుడి ఆచూకీ తెలుసుకొని తల్లికి అప్పగించిన కొత్తపల్లి పోలీసులను ప్రజలు అభినందించారు. వివరాల ప్రకారం... అమీనబాద్‌కు చెందిన మైలపల్లి విజయ్‌(4) సోమవారం ఇంటి నుంచి బయటకు వచ్చి ఆడకున్నాడు. వీవీఎ్‌సలో చదివే మరో బాలుడితో పాటు కాన్వెంటుకు వెళ్లే బస్‌ లో విజయ్‌ ఎక్కేశాడు. కుటుంబసభ్యులు అంగన్‌వాడీకి వెళ్లాడని భావించారు. మధ్యాహ్నం 12గంటలైనా విజయ్‌ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు సాయంత్రం వరకు ఊరంతా వెతికారు. ఫలి

తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించిన పోలీసులు
అమీనబాద్‌లో బాలుడిని అప్పగించిన పోలీసులు

కొత్తపల్లి, అక్టోబరు 25: ఇంటి నుంచి ఆడుకుంటూ వచ్చి తప్పిపోయిన బాలుడి ఆచూకీ తెలుసుకొని తల్లికి అప్పగించిన కొత్తపల్లి పోలీసులను ప్రజలు అభినందించారు. వివరాల ప్రకారం... అమీనబాద్‌కు చెందిన మైలపల్లి విజయ్‌(4) సోమవారం ఇంటి  నుంచి బయటకు వచ్చి ఆడకున్నాడు. వీవీఎ్‌సలో చదివే మరో బాలుడితో పాటు కాన్వెంటుకు వెళ్లే బస్‌ లో విజయ్‌ ఎక్కేశాడు. కుటుంబసభ్యులు అంగన్‌వాడీకి వెళ్లాడని భావించారు. మధ్యాహ్నం 12గంటలైనా విజయ్‌ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు సాయంత్రం వరకు ఊరంతా వెతికారు. ఫలితం లేకపోవడంతో కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పిఠాపురం సీఐ వైఆర్కే.శ్రీనివాసరావు, ఎస్‌ఐ అబ్దుల్‌ నబి అమీనబాద్‌ నుంచి విచారణ చేపట్టారు. తప్పిపోయిన బాలుడు వీవీఎ్‌సస్కూల్‌ బస్‌లో ఉన్నాడని తెలుసుకుని తల్లికి అప్పగించారు. సీఐ,ఎ్‌సలకు బాలుడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-10-26T06:43:58+05:30 IST