తెలివైన బాలుడు!

Published: Sat, 29 Jan 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తెలివైన బాలుడు!

ఒక బాలుడు ఊరిలోంచి నడుస్తూ అడవిలోకి వెళ్లిపోయాడు. మామిడి చెట్టు దగ్గరికెళ్లాడు. కిందపడిన మామిడి పండ్లను ఏరుకుంటున్నాడు. ఇంతలోనే దగ్గరగా.. ‘కాపాడండి’అనే ధ్వని వినిపించింది. పక్కకు చూస్తే ఓ బాటిల్‌.. అందులో వింత జీవి కనిపించాడు. ‘నన్ను విడిపించు’ అంటూ వేడుకున్నాడు. గాజు సీసా బిరడాను తీసేశాడా బాలుడు. వెంటనే ఆ వింతజీవి బయటికొచ్చింది. ‘ఓ మంత్రగాడు నన్నిలా బంధించాడు. నీవల్ల బయటపడ్డాను. నిన్ను తినేస్తా’ అన్నది. ఆ బాలుడు ఖంగుతిన్నాడు. భయాన్ని లోపలే దాచుకున్నాడు. ‘నేను కలిసిన వారిలోకెల్లా అతి పెద్ద అబద్ధాల కోరువి నువ్వు. ఇంత భారీ రూపం అంత చిన్న గాజుసీసాలో ఎలా సరిపోయింది?’ అంటూ నవ్వాడు. ‘ఇదిగో చూడు’ అంటూ ఆ వింత జీవి సీసాలోకి వెళ్లింది. వెంటనే ఆ సీసాకి మూతపెట్టాడు. సీసా లోపలనుంచి ‘బాబూ.. నన్ను కాపాడు. నా బుద్ధి సరిగాలేదు. నిన్ను తినాలనుకోవడం పాపం. నా మూర్ఖత్వం’ అంటూ ఏడ్చింది. ఆ పిల్లవాడు ఏమీ మాట్లాడలేదు. ‘నా దగ్గర ఓ మంత్రదండం ఉంది. అది ఎలాంటి గాయాలనైనా మాన్పుతుంది. దేన్నైనా బంగారంగా మార్చొచ్చు’ అన్నాడు. ఆ బాలుడు అవేమీ పట్టించుకోకుండా ఆ బాటిల్‌ను చెట్ల పొదల మధ్య ఉంచేసి మామిడిపండు తింటూ ఇంటికెళ్లిపోయాడు.

నీతి: దుష్టులకు దూరంగా ఉండాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.