Viral Video: తండ్రి ముందే కూతురికి పెళ్లి ప్రపోజల్.. అతని రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-10T23:19:21+05:30 IST

ప్రియురాలికి ప్రేమ లేదా పెళ్లి గురించి ప్రపోజ్ చేసేటపుడు ప్రియుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు.

Viral Video: తండ్రి ముందే కూతురికి పెళ్లి ప్రపోజల్.. అతని రియాక్షన్ ఏంటంటే..

ప్రియురాలికి ప్రేమ లేదా పెళ్లి గురించి ప్రపోజ్ చేసేటపుడు ప్రియుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆమె ఏమంటుందో అని ఎంతో టెన్షన్ పడుతుంటాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేయాలనే విషయాల గురించి ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు తన ప్రేయసికి ఓ సరస్సు పై ఉన్న బ్రిడ్జి మధ్యలో పెళ్లి ప్రపోజల్ చేశాడు. విశేషమేమిటంటే ఆ సమయంలో ఆ అమ్మాయి తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. 


ఒక అమ్మాయికి ఆమె బాయ్‌ఫ్రెండ్ పెళ్లి ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఆమె తండ్రి వెనకాలే కూర్చుని ఉన్నాడు. తన కూతురికి ఎంగేజ్‌మెంట్ జరుగుతోందని అటువైపు వస్తున్న వారికి చెబుతున్నాడు. అటువైపు వెళ్లవద్దని అభ్యర్థిస్తున్నాడు. ఆ అమ్మాయి తన ప్రియుడికి `ఎస్` చెప్పిన తర్వాత రెండు చేతులూ పైకెత్తి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. లక్ష మందికి పైగా లైక్ చేశారు. `అతనికి బెస్ట్ డాడ్ అవార్డు ఇవ్వాల్సిందేన`ని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-10T23:19:21+05:30 IST