5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. యువకుడికి 20 ఏళ్ల జైలు

ABN , First Publish Date - 2022-06-22T20:20:08+05:30 IST

ఫిబ్రవరి 12, 2017లో చిన్నారి ఇంటి దగ్గర ఆడుకుంటుండగా నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని అడిషనల్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కౌన్సిల్ సుభాష్ చంద్ర చతుర్వేది తెలిపారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవడం చూసిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి..

5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. యువకుడికి 20 ఏళ్ల జైలు

లఖ్‌నవూ: నాలుగేళ్ల క్రితం ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ ఒక యువకుడికి ఉత్తరప్రదేశ్‌లోని మధుర కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు మంగళవారం తీర్పు వెలువరించింది. అయితే 2017లో నేరానికి పాల్పడ్డ సమయంలో తాను మైనర్‌నని నిందితుడు చెప్పడంతో అతడిని జువైనల్ హోంకి పంపారు. కానీ అతడు చేసిన నేర తీవ్రత అడల్డ్ స్థాయికి ప్రయత్నించాడని తాజాగా కోర్టుకు జువైనల్ జస్టిస్ బోర్డ్ పేర్కొంది. జువైనల్ జస్టిస్ బోర్డ్ సూచన మేరకు నిందితుడిని 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.


ఫిబ్రవరి 12, 2017లో చిన్నారి ఇంటి దగ్గర ఆడుకుంటుండగా నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని అడిషనల్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కౌన్సిల్ సుభాష్ చంద్ర చతుర్వేది తెలిపారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవడం చూసిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం ఆమెపై బలవంతం జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. వారు వెంటనే పోలీసులను సంప్రదించి కేసు నమోదు చేశారు. అనంతరం నేరస్తుడిని అరెస్ట్ చేసి విచారించగా నేరం ఒప్పుకున్నాడని, నిందితుడిపై ఐపీసీలోని సెక్షన్ 376, 377, 323.. పోక్సోలోని సెక్షన్ 5, 6 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో తాను మైనర్‌నని నిందితుడు చెప్పడంతో కోర్టు ఆదేశాల మేరకు అతడిని జువైనల్ హోంకి పంపారు.

Updated Date - 2022-06-22T20:20:08+05:30 IST