బాలుడి కోరిక తీర్చిన ఎస్‌ఐ

ABN , First Publish Date - 2022-05-01T13:35:48+05:30 IST

పోలీసు టోపీ ధరించి బైక్‌పై వెళ్లాలన్న బాలుడి కోరికను వాణియంబాడి పోలీసు ఎస్‌ఐ తీర్చారు. తిరుపత్తూర్‌ జిల్లా వాణియంబాడి బస్టాండ్‌ సమీపంలో పోలీసులు వాహన

బాలుడి కోరిక తీర్చిన ఎస్‌ఐ

ఐసిఎఫ్‌(చెన్నై): పోలీసు టోపీ ధరించి బైక్‌పై వెళ్లాలన్న బాలుడి కోరికను వాణియంబాడి పోలీసు ఎస్‌ఐ తీర్చారు. తిరుపత్తూర్‌ జిల్లా వాణియంబాడి బస్టాండ్‌ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా ముజకీర్‌ అనే వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడు ముబషీర్‌తో వచ్చాడు. పోలీసులు తనిఖీలు చేయడాన్ని చూసిన బాలుడు పరిగెత్తుకుంటూ ఎస్‌ఐ రాజా వద్దకు వెళ్లి ‘అంకుల్‌... మీ టోపీ ధరించి బైక్‌పై వెళ్లాలని ఉందని’ కోరాడు. వెంటనే బాలుడి కోరిక నెరవేర్చేలా ఎస్‌ఐ రాజా బాలుడిని బైక్‌పై ఎక్కించుకొని తన టోపీ బాలుడి తలపై పెట్టి బస్టాండ్‌ వరకు తీసుకెళ్లి మళ్లీ అదే స్థలానికి తీసుకొచ్చి దింపి వెళ్లారు.

Updated Date - 2022-05-01T13:35:48+05:30 IST