11 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌తో 14 ఏళ్ల కుర్రాడు జంప్... 1900 కిలోమీటర్లు ప్రయాణించి...

ABN , First Publish Date - 2020-11-17T17:37:11+05:30 IST

14 ఏళ్ల కుర్రాడొకడు తన 11 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్‌ను తీసుకుని ఇంటి నుంచి పారిపోయాడు. ఆ కుర్రాడు...

11 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌తో 14 ఏళ్ల కుర్రాడు జంప్... 1900 కిలోమీటర్లు ప్రయాణించి...

న్యూయార్క్: 14 ఏళ్ల కుర్రాడొకడు తన 11 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్‌ను తీసుకుని ఇంటి నుంచి పారిపోయాడు. ఆ కుర్రాడు తన తండ్రి కారులో తన గర్ల్‌ఫ్రెండ్‌ను కూర్చోబెట్టుకుని, స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటి నుంచి చెక్కేశాడు. గాలికన్నా వేగంగా కారును నడిపిస్తూ ముందుకు కదిలాడు. ఈ ఉదంతం న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. ఆ బాలుడు ఇంటి నుంచి 1,900 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లాక పోలీసులు ఆ ప్రేమ జంటను పట్టుకోగలిగారు. 


ఆ బాలుని పేరు కెవిన్ ఫిగురోస్. అతను కారులో తన గర్ల్ ఫ్రెండ్‌ను తీసుకుని, న్యూయార్క్ నుంచి ఆవోవాకు చేరుకున్నాడు. పోలీసులు వారిని ఆవోవాలో పట్టుకున్నారు. వారిని న్యూయార్క్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ముందు ఆ బాలుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆ కుర్రాడు తన తండ్రికి చెందిన టయోటా కంపెనీ మినీ వ్యాన్ తీసుకుని ఇంటి నుంచి వెల్లిపోయాడు. ఆ కుర్రాడు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో కారును పోనిచ్చాడని పోలీసులు తెలిపారు. ఆ మార్గంలో గంటకు 104 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలనే నిబంధన ఉంది. అయితే ఆ బాలుడు ఎందుకు ఇంటి నుంచి పరారయ్యాడన్నని ఇంతవరకూ వెల్లడికాలేదు.



Updated Date - 2020-11-17T17:37:11+05:30 IST