రాజరాజేశ్వరిదేవిగా బోయకొండ గంగమ్మ

ABN , First Publish Date - 2021-10-17T06:43:46+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ దసరా మహోత్సవంలో తొమ్మిదో రోజు అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

రాజరాజేశ్వరిదేవిగా బోయకొండ గంగమ్మ
మదనసల్లె సబ్‌ కలెక్టర్‌ జాహ్నవికి తీర్థప్రసాదాలు అందిస్తున్న అలయ చైర్మన్‌ మిద్దిటి శంకర్‌నారాయణ, ఈవో చంద్రమౌళిలు

ముగిసిన  దసరా మహోత్సవాలు

చౌడేపల్లె, ఆక్టోబరు 16: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ దసరా మహోత్సవంలో తొమ్మిదో రోజు అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ధూపదీప, నైవేద్యం సమర్పించారు. అమ్మవారి అద్దాల మండపం వద్ద ప్రత్యేకంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని అలంకరించి, కలశ స్థాపన చేసి ప్రత్యేకంగా అలంకరిం చారు. అనంతరం ఉభయదారులచే అమ్మవారి మూల మంత్రాన్ని పఠింపచేస్తూ సర్వశుభాలకు నిలయమైన రాజరాజేశ్వరి దేవి విశిష్టతను వివరించారు. ఉభయదారులుగా వాల్మీకిపురానికి చెందిన శ్రీదేవి, రఘురామిరెడ్డి, వంశీప్రియ, సౌమిత్‌ రెడ్డి వ్యవహరించారు. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉభయదారులకు, సబ్‌కలెక్టర్‌ జాహ్నవికి ఆలయ చైర్మన్‌ మిద్దింటి శంకరనారాయణ, ఈవో చంద్రమౌళి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.  

Updated Date - 2021-10-17T06:43:46+05:30 IST