గంగమ్మ నామస్మరణతో మార్మోగిన బోయకొండ

ABN , First Publish Date - 2022-05-23T06:27:25+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆదివారం గంగమ్మ నామస్మరణతో మార్మోగింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రద్దీ కొనసాగింది.

గంగమ్మ నామస్మరణతో మార్మోగిన బోయకొండ
ప్రత్యేకాలంకారంలో బోయకొండ గంగమ్మ

మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగిన రద్ది


చౌడేపల్లె, మే 22: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆదివారం గంగమ్మ నామస్మరణతో మార్మోగింది. ఉదయం  అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి అమ్మవారికి ప్రీతికరమైన వేపాకు తోరణాలతో ఆలయాన్ని అలంకరించారు. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేసి, స్వర్ణాభరణాలతో, పూలతో ప్రత్యేకంగా అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిచారు. సుమారు 20 వేలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా  తమిళనాడు, కర్ణాటకల నుంచి భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రద్దీ  కొనసాగింది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్‌  శంకర్‌నారాయణ,  ఈవో చంద్రమౌళి సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 




Updated Date - 2022-05-23T06:27:25+05:30 IST