ప్రేమ జంట చేసిన పనితో కలకలం.. నిలిచిపోయిన గూడ్స్ రైలు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-21T20:11:59+05:30 IST

వారిద్దరూ ప్రేమికులు.. ఏడాదిన్నర నుంచి ప్రేమలో ఉన్నారు.. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు..

ప్రేమ జంట చేసిన పనితో కలకలం.. నిలిచిపోయిన గూడ్స్ రైలు.. చివరకు ఏం జరిగిందంటే..

వారిద్దరూ ప్రేమికులు.. ఏడాదిన్నర నుంచి ప్రేమలో ఉన్నారు.. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.. దీంతో వారు చనిపోవాలని నిర్ణయించుకున్నారు.. రైల్వే బ్రిడ్జి పైకి ఎక్కి నదిలోకి దూకేందుకు ప్రయత్నించారు.. వారిద్దరినీ చూసిన స్థానికులు పోలీసులను, రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు.. అక్కడకు చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులును పిలిపించి మాట్లాడారు.. గంటన్నర హైడ్రామా తర్వాత ఆ ఇద్దరూ కిందికి దిగారు. 


రాజస్థాన్‌లోని ఛిత్తోర్‌గఢ్‌కు చెందిన కరణ్ అనే యువకుడు తమ కాలనీలో నివసించే 16 ఏళ్ల మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఏడాదిన్నర నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలూ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కడమాలి నదిలో దూకి చనిపోయేందుకు రైల్వే బ్రిడ్జి ఎక్కారు. వారిద్దరినీ చూసిన స్థానికులు పోలీసులను, రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఆ ట్రాక్‌పై రావాల్సిన గూడ్సు రైలును రైల్వే అధికారులు నిలిపివేశారు. 


పెళ్లికి అంగీకరిస్తేనే తాము దిగి వస్తామని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులను పోలీసులు స్పాట్‌కు పిలిపించారు. కుటుంబ సభ్యులు హామీ ఇచ్చిన తర్వాత ఇద్దరూ కిందకు దిగి వచ్చారు. గంటన్నర పాటు అలజడి సృష్టించినందుకు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మైనర్ బాలికను అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. 

Updated Date - 2022-03-21T20:11:59+05:30 IST