ఖరీదైన సెల్ ఫోన్ ప్రియురాలికి బహుమతిగా ఇచ్చిన యువకుడు.. బ్రేకప్ తరువాత సెల్ ఫోన్ తిరిగివ్వమని గొడవ.. ఆ గొడవలో ఎంత దారుణం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-08T07:57:38+05:30 IST

ప్రేమలో ఉన్న వ్యక్తులు బహుమతుల ద్వారా తమ ప్రేమను అవతలి వ్యక్తికి తెలియజేస్తూ ఉంటారు. ప్రేమలో ఉన్నంత సేపూ బహుమతులు ఇచ్చి పుచ్చుకోనే వ్యక్తులు బ్రేకప్ జరిగిపోయాక శత్రువుల్లా మారిపోతారు. తాజాగా జార్ఖండ్‌లో షాకింగ్ ఘటన ఒకటి బయటకు వచ్చింది. జార్ఖండ్‌లోని పాకుర్‌‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు తను ఇచ్చిన ఖరీదైన సెల్‌ఫోన్‌ను...

ఖరీదైన సెల్ ఫోన్ ప్రియురాలికి బహుమతిగా ఇచ్చిన యువకుడు.. బ్రేకప్ తరువాత సెల్ ఫోన్ తిరిగివ్వమని గొడవ.. ఆ గొడవలో ఎంత దారుణం జరిగిందంటే..

ప్రేమలో ఉన్న వ్యక్తులు బహుమతుల ద్వారా తమ ప్రేమను అవతలి వ్యక్తికి తెలియజేస్తూ ఉంటారు. ప్రేమలో ఉన్నంత సేపూ బహుమతులు ఇచ్చి పుచ్చుకోనే వ్యక్తులు బ్రేకప్ జరిగిపోయాక శత్రువుల్లా మారిపోతారు. తాజాగా జార్ఖండ్‌లో షాకింగ్ ఘటన ఒకటి బయటకు వచ్చింది. జార్ఖండ్‌లోని పాకుర్‌‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు తను ఇచ్చిన ఖరీదైన సెల్‌ఫోన్‌ను తిరిగి ఇవ్వలేదనే కోపంతో తన మాజీ ప్రేయసిని చంపేశాడు. 


రెండేళ్ల ప్రేమాయణం సాగించిన ఆ ప్రేమికులు వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే అబ్బాయి ఇంట్లో వారు ఆ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆ యువకుడు తన ప్రేయసికి బ్రేకప్ చెప్పేసి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అంతేకాదు గతంలో తాను కొనిచ్చిన ఖరీదైన ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలని మాజీ ప్రేయసిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే ఆ ఫోన్‌ను తిరిగిచ్చేందుకు ఆ మాజీ ప్రేయసి అంగీకరించలేదు. ఆ ఫోన్‌ను తీసుకునేందుకు ఆ యువకుడు ఓ స్కెచ్ వేశాడు.


ఆదివారం సాయంత్రం ఆమెను ఆ యువకుడు బయటకు తీసుకెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత సెల్‌ఫోన్‌ తీసుకుని పరారయ్యాడు. ఆ యువతి మృతదేహాన్ని సోమవారం ఉదయం కొందరు స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రియుడే ఆమెను చంపినట్టు తేల్చి అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-04-08T07:57:38+05:30 IST