నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే యువతి హత్య.. పోలీసుల విచారణలో ప్రియుడి పేరు.. నిలదీస్తే అతడు చెప్పిన నిజాలు విని..

Published: Wed, 05 Jan 2022 15:54:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే యువతి హత్య.. పోలీసుల విచారణలో ప్రియుడి పేరు.. నిలదీస్తే అతడు చెప్పిన నిజాలు విని..

ఇంటర్నెట్‌ డెస్క్: కూతురికి మంచి సంబంధం రావడంతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఫిక్స్ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో జరగబోయే పెళ్లి కోసం కుటుంబసభ్యలు పనులు కూడా మొదలుపెట్టారు. అంతలోనే పెళ్లిపీటలెక్కాల్సిన ఆమెను హత్య చేశారు. పోలీసుల విచారణలో ప్రియుడి పేరు బయటకు వచ్చింది. నిలదీస్తే అతడు చెప్పిన నిజాలు విని అంతా షాకయ్యారు. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. 


దుంగర్‌పూర్‌కు చెందిన 23 ఏళ్ల ముఖేష్ మీన స్థానిక కంపెనీలో పనిచేసేవాడు. దానికి పక్కనే ఉన్న వేరే కంపెనీలో పనిచేసే యువతితో ముఖేష్‌కు పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి సరదాగా తిరుగుతుండేవారు. ఇలా వారి ప్రేమాయాణం రెండేళ్లు కొనసాగింది. ఆ తర్వాత వారి ప్రేమ గురించి యువతి ఇంట్లో తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను హెచ్చరించి.. వేరొక సంబంధం కుదిర్చి పెళ్లి ఫిక్స్ చేశారు. కొద్ది రోజుల క్రితమే ఘనంగా నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే తన ప్రియురాలు వేరొకరితో పెళ్లికి సిద్ధమైన విషయం తెలుసుకున్న ముఖేష్ ఆమెపై ఆగ్రహం పెంచుకున్నాడు. ఆమెను హత్య చేయడానికి ప్లాన్ వేసుకున్నాడు.


ఈ క్రమంలోనే జనవరి 2న ప్రియురాలికి ఫోన్ చేసిన ముఖేష్ ఒక్కసారి తనని కలవాలని కోరాడు. దీంతో ఆమె ఒంటరిగా ప్రియుడి ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి ఆమెను పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి పదునైన కత్తితో ప్రియురాలిని హత్య చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ముఖేష్ ఆమెను చెట్టుకు వేలాడదీసి పారిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విచారణలో ప్రియుడి గురించి తెలిసి నిలదీస్తే అతడు జరిగిందంతా చెప్పాడు. హత్య తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఖేష్‌ను అరెస్ట్ చేశారు.



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.