తల్లి ఊరెళ్లడంతో బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిపించుకుంది.. 2 రోజుల తరువాత గదిలో దృశ్యం చూసి ఇంటి ఓనర్‌కు భారీ షాక్!

Published: Sun, 29 Aug 2021 14:26:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తల్లి ఊరెళ్లడంతో బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిపించుకుంది.. 2 రోజుల తరువాత గదిలో దృశ్యం చూసి ఇంటి ఓనర్‌కు భారీ షాక్!

ఇంటర్నెట్ డెస్క్: రాఖీ పండగ సందర్భంగా తన తల్లి ఊరెళ్లడంతో ఓ యువతి ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. తల్లి నాలుగు రోజుల పాటు ఊరులోనే ఉంటానని చెప్పడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తమ ఇంటి ఓనర్‌కు తెలియకుండా ఉండేందుకు ఆమె ప్రియుడిని ఇంట్లోనే దాచిపెట్టింది. తాను ఆఫీసుకు వెళ్లే సమయంలో ఇంటికి తాళం పెట్టి వెళ్లిపోయేది. ఈ క్రమంలో ఓ రోజు ప్రియుడు అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరిపోసుకుని ప్రాణాలు వదిలాడు.


ఫ్యాన్‌కు వెళ్లాడుతున్న అతడి మృతదేహాన్ని గమనించిన ఇంటి ఓనర్ కుమారుడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఈ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకైపోయిన ఇంటి ఓనర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్ జిల్లాలో ఆగస్టు 27న జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 

కాగా.. ఇంటి ఓనర్ ఇచ్చిన ఫిర్యాదు‌తో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమె ప్రేమవ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో ఏదో విషయమై యువతి ఘర్షణ పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘర్షణ తరువాతే అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలను వెలికితీసేందుకు  పోలీసులు ప్రస్తుతం యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.