బీపీఆర్‌ కాలువ నీటి ప్రవాహం పరిశీలన

ABN , First Publish Date - 2021-05-11T04:12:17+05:30 IST

సంగం వద్ద బెజవాడ పాపిరెడ్డి కాలువ నీటి ప్రవాహాన్ని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం సెక్షన్‌ అధికారులతో

బీపీఆర్‌ కాలువ నీటి ప్రవాహం పరిశీలన
కాలువ దగ్గర అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామిరెడ్డి

 సంగం, మే 10: సంగం వద్ద బెజవాడ పాపిరెడ్డి కాలువ నీటి ప్రవాహాన్ని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం సెక్షన్‌ అధికారులతో మాట్లాడారు. బీపీఆర్‌ కాలువకు నీటి విడుదలను 900 క్యూసెక్కులకు పెంచాలని కోరారు. కాలువ కింద రెండవ పంటకు సుమారు 70 వేల ఎకరాల ఆయకట్టుకు అనుమ తి ఇచ్చారన్నారు. ఆ మేరకు రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం విడుదల చేసే 200 క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకు వెళ్లడం లేదన్నారు. నీటి విడుదలను 900 క్యూసెక్కులకు పెంచి చెరువులకు తరలించాలని అధికారులకు సూచించారు. రైతులు వేసే రెండో పంటకు నీటి డోకా లేదని రైతులు ధైర్యంగా వెంటనే నారుమళ్లు పోసుకుని నాట్లు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్షన్‌ అధికా రి రవీంద్ర, పలువురు వైసీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.

Updated Date - 2021-05-11T04:12:17+05:30 IST