బ్రహ్మోస్‌ ప్రయోగం విజయవంతం

Published: Fri, 21 Jan 2022 02:35:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బ్రహ్మోస్‌ ప్రయోగం విజయవంతం

న్యూఢిల్లీ, జనవరి 20 : కొత్త తరం సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ బ్రహ్మో్‌సను ఒడిసా తీరంలోని బాలాసోర్‌ నుంచి గురువారం విజయవంతంగా ప్రయోగించారు. నూతన సాంకేతికతను ఈ క్షిపణికి అనుసంధానించినట్టు రక్షణశాఖ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం నుంచి ఈ నెల పదకొండో తేదీన బ్రహ్మోస్‌ క్షిపణిని డీఆర్‌డీవో అధికారులు విజయవంతంగా ప్రయోగించారు. సముద్ర తలం నుంచి సముద్రతలం వరకు లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణిని పది రోజుల వ్యవధిలోనే మరోసారి ఇదే యుద్ధ నౌక నుంచి ప్రయోగించి.. అనుకున్న ఫలితాన్ని రక్షణ శాఖ సాధించింది. ఈ క్షిపణిని భారత్‌, రష్యా కలిసి అభివృద్ధి చేస్తున్నాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.